ETV Bharat / sports

భారత్​-పాక్​ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్న గేల్.. యాషెస్​ కూడా తక్కువేనట!

author img

By

Published : Jul 1, 2023, 4:03 PM IST

ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌ 2023 పోరులో భాగంగా అక్టోబర్​ 15న జరగబోయే భారత్​-పాక్​ మ్యాచ్​కు సంబంధించి వెస్టిండీస్​ మాజీ స్టార్​ ఆటగాడు క్రిస్​ గేల్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్‌ సిరీస్‌ కూడా దాయాదుల పోరు ముందు తక్కువేనని పేర్కొన్నాడు.

Chris Gayle Comments On India vs Pakistan World Cup Match
IND vs PAK : 'భారత్​-పాక్​ మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నా.. దీని ముందు యాషెస్​ కూడా తక్కువే'.. గేల్​ ఆసక్తికర వ్యాఖ్యలు

ODI World Cup 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్​ 2023 షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో అక్టోబర్​ 15న జరగబోయే భారత్​-పాక్​ మ్యాచ్​ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సెమీస్‌కు ఎవరు వస్తారు? కప్‌ను ఎవరు సొంతం చేసుకుంటారు? అని పలువురు మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ మాజీ స్టార్‌ ప్లేయర్​ క్రిస్‌ గేల్ ఈ పోరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీ ముందు ప్రస్తుతం లండన్​ వేదికగా జరుగుతున్న యాషెస్​ సిరీస్​ కూడా చిన్నబోతుందని వ్యాఖ్యానించాడు.

దీని ముందు అది కూడా తక్కువే..
Ashes 2023 : లండన్​లోని లార్డ్స్​ మైదానంలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండు టెస్టుల యాషెస్​ సిరీస్​ కూడా ఈ దాయాదుల పోరు కంటే తక్కువే అని అన్నాడు ఈ యునివర్సల్​ బాస్​. "అక్టోబర్ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరిగే భారత్-పాక్‌ మ్యాచ్‌ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. అయితే ఈ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కీలకం కానున్నారు. వాళ్లే టీమ్​ఇండియా​ స్టార్ పేసర్​ జస్ప్రీత్ బుమ్రా, స్టార్​ బ్యాటర్​ సూర్యకుమార్‌ యాదవ్. ప్రస్తుతం గాయం కారణంగా ఎన్​సీఏ ఆధ్వర్యంలో విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా కోలుకుని వీలైనంత త్వరగా జట్టులోకి వస్తాడనే నమ్మకముంది" అని గేల్‌ తెలిపాడు.

Chris Gayle : ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్‌ మధ్య జరిగే మ్యాచ్​ను అత్యంత ప్రజాదరణ కలిగిన పోరుగా అభివర్ణించాడు క్రిస్​ గేల్​. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన పోటీని కోట్లాది మంది వీక్షించారని గుర్తు చేశాడు. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్​-పాక్‌ మ్యాచ్‌కు 273 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయని చెప్పాడు.

షెడ్యూల్​ ఇది..
ICC World Cup 2023 Schedule : ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్​కప్​ 2023 సిరీస్​ భారత్​ వేదికగా అక్టోబర్​ 5న​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం 10 వేదికలను సిద్ధం చేశారు. 10 జట్లు ఈ ప్రపంచకప్​ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే 8 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా.. మరో రెండు జట్లు జింబాబ్వేలో జరిగే క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌ ద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో రౌండ్‌ బిన్‌ పద్ధతిలో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో సెమీఫైనల్స్‌కు పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు ఫైనల్​ సమారానికి అర్హత సాధిస్తాయి. నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌ వేదికగా 3 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.