ETV Bharat / sports

మయాంక్.. ఆత్మవిశ్వాసానికి నిదర్శనం: లక్ష్మణ్

author img

By

Published : Dec 10, 2021, 6:18 PM IST

VVS Laxman Comments on Mayank Agarwal: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్​ ప్రదర్శనపై మాట్లాడాడు దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. ఆత్మవిశ్వాసంతో మయాంక్ రాణించాడని చెప్పుకొచ్చాడు.

vvs laxman
వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman Comments on Mayank Agarwal: భారత్​, న్యూజిలాండ్ టెస్టు సిరీస్​లో భాగంగా ఓపెనర్​ మయాంక్ అగర్వాల్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రెండో టెస్టులో 150, 62 పరుగులతో జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీనిపై టీమ్​ఇండియా దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీకి కాబోయే అధ్యక్షుడు వీవీఎస్​ లక్ష్మణ్ మాట్లాడాడు. మయాంక్ ఆత్మవిశ్వాసానికి చాలా ప్రధాన్యత ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానల్​ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు లక్ష్మణ్.

"ఆత్మవిశ్వాసానికి మయాంక్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మెరుగైన ప్రదర్శనతో అతడేంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్​ క్లాస్​, అంతర్జాతీయ క్రికెట్​లో ఆడే విధంగానే టెస్టులోనూ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇది చాలా మంచి విషయం."

--వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్.

స్పిన్నర్లు సత్తాచాటిన మైదానంలోనూ మయాంక్ మంచి షాట్లు ఆడటం మెచ్చుకోదగిన విషయమని లక్ష్మణ్ అన్నాడు. అజాజ్ పటేల్​ బౌలింగ్​లోనూ కళ్లుచెదిరే షాట్లు కొట్టాడని గుర్తుచేశాడు. కైల్ జేమిసన్, టిమ్​ సౌథీ వ్యూహాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని ప్రశంసించాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ కాన్పుర్​ టెస్టులో విఫలమయ్యాడు. కానీ, ముంబయి వేదికగా ఉత్తమంగా రాణించి ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత్​ సిరీస్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా కెప్టెన్​గా రోహిత్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే?

MSK Prasad on Rahane: 'రహానేను అందుకే ఎంపిక చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.