ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్- తొలి టీ20కి విరాట్ దూరం- కారణం ఏంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 5:36 PM IST

Updated : Jan 10, 2024, 6:45 PM IST

Virat Kohli Afghanistan T20
Virat Kohli Afghanistan T20

Virat Kohli Afghanistan T20: అఫ్గానిస్థాన్​తో తొలి టీ20 మ్యాచ్​కు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

Virat Kohli Afghanistan T20: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్​తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్​కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అధికారికంగా ప్రకటించాడు. 'వ్యక్తిగత కారణాల వల్ల విరాట్, అఫ్గాన్​తో తొలి మ్యాచ్​కు అందుబాటులో ఉండడం లేదు' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్​​లో భాగంగా భారత్- అఫ్గానిస్థాన్ మధ్య జనవరి 11న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు మొహాలీ స్టేడియం వేదిక కానుంది.

14 నెలల తర్వాత ఎంట్రీ! టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు 14 నెలలు పొట్టి ఫార్మాట్ క్రికెట్​కు దూరంగా ఉన్నారు. వన్డే వరల్డ్​కప్ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్న స్టార్ బ్యాటర్లు, తాజాగా టీ20 ల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐకి తెలిపారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ అఫ్గాన్ సిరీస్​కు వీరిద్దర్ని ఎంపిక చేసింది. దీంతో చాలా రోజుల తర్వాత రోహిత్, విరాట్​ను టీ20ల్లో చూడనన్నామంటూ క్రికెట్​ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే విరాట్ తొలి మ్యాచ్​కు దూరం కావడం వల్ల కాస్త నిరాశ చెందుతున్నారు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్​దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ ఖాన్

Afghanistan Squad For India Series: అఫ్గానిస్థాన్​ బోర్డు కూడా శనివారం జట్టును ప్రకటించింది. ఈ సిరీస్​తో జట్టులో స్టార్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ జట్టుకు ఇబ్రహీమ్ జోర్డాన్​కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీమ్ జోర్డాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, హజ్మతుల్లా జజాయ్, అలిఖిల్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, జర్డాన్, ఓమర్జాయ్, అష్రఫ్, ముజీబ్ రహ్మన్, ఫారుకీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, సలీమ్, అహ్మద్, నబీ, రషీద్ ఖాన్.

భారత్​- అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యుల్:

  • ​జనవరి 11 తొలి టీ20- మొహాలీ రాత్రి 7 గంటలకు
  • జనవరి 14 రెండో టీ20- ఇందౌర్‌ రాత్రి 7 గంటలకు
  • జనవరి 17 మూడో టీ20- బెంగళూరు రాత్రి 7 గంటలకు

భారత్​ x అఫ్గాన్​ - ఇంట్రెస్టింగ్​గా ప్లేయింగ్​ 11 - ఆడేదెవరు? ఆగేదెవరు?

టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్​కు జట్టు ప్రకటన

Last Updated :Jan 10, 2024, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.