ETV Bharat / sports

WTC: బంగ్లాపై విజయం.. భారత్​ ఫైనల్​​ ఆశలు సజీవం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని..

author img

By

Published : Dec 25, 2022, 12:55 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆశలు భారత్‌కు సజీవంగా ఉన్నాయి. తాజాగా బంగ్లాపై విజయంతో భారత్‌ పాయింట్ల పట్టికలో ద్వితీయస్థానాన్ని నిలబెట్టుకొంది.

updated-world-test-championship-points-table
updated-world-test-championship-points-table

World Test Champion Ship India: బంగ్లా పర్యటనలో రెండు టెస్టులను భారత్‌ గెలవడంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఈ పట్టకలో ఆస్ట్రేలియా 76.92 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్‌ 58.93 శాతంతో 99 పాయింట్లు సాధించి రెండోస్థానంలో కొనసాగుతోంది. రేపటి నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో ద్వితీయ టెస్ట్‌ ఆడనున్న దక్షిణాఫ్రికా 54.55 శాతంతో ఈ టేబుల్‌లో మూడో స్థానం దక్కించుకొంది. ఆ తర్వాత శ్రీలంక, ఇంగ్లాండ్‌,వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. తాజాగా భారత్‌ మిర్పూర్‌లో జరిగిన టెస్టులో బంగ్లాపై విజయం సాధించడంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ బలమైన పోటీ ఎదుర్కొంటోంది. భారత్‌ ఒక వేళ ఆస్ట్రేలియా సిరీస్‌లో 4-0 తేడాతో విజయం సాధిస్తే 68.05 విజయ శాతం లభిస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా మిగిలిన నాలుగు టెస్టులను గెలిచినా కూడా కేవలం 66.66 శాతమే ఉంటుంది. ఫైనల్స్‌కు అవకాశం రాదు. ఇక భారత్‌ 3-0తో సిరీస్‌ను సాధిస్తే మాత్రం 64.35 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా తన నాలుగు టెస్టుల్లో విజయం సాధిస్తేనే ఫైనల్స్‌కు అడుగుపెడుతుంది. ఇక మిగిలిన జట్లకు ఫైనల్స్‌కు చేరేందుకు మార్గాలు దాదాపు మూసుకుపోయాయి. ఇక మిర్పూర్‌లో బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌(Team India) 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.