ETV Bharat / sports

IND VS Ireland First T20 : ఇంట్రెస్టింగ్​ వీడియోస్ చూశారా.. తొలి మ్యాచ్​లో ఎన్ని సిక్స్​లు, ఫోర్లు నమోదయ్యాయంటే..

author img

By

Published : Aug 19, 2023, 10:52 AM IST

IND VS Ireland First T20 : ఐర్లాండ్‌ - టీమ్​ఇండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ వర్షం వల్ల పూర్తిస్థాయిలో జరగలేదు. కానీ ఫ్యాన్స్​కు మస్త్ ఎంటర్​టైన్మెంట్ దొరికింది. మరి ఈ మ్యాచ్​ గురించి టీమ్​ఇండియా కెప్టెన్ ఏం అన్నాడు? మ్యాచ్​లో నమోదైన ఆసక్తికరమైన విషయాలు ఏంటి చూద్దాం..

Teamindia VS Ireland First T20 match
Teamindia VS Ireland First T20 match

IND VS Ireland First T20 : ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మొదటి టీ20తో టీమ్​ఇండియా శుభారంభం చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు జరిగిన వరుస ఐదు మ్యాచుల్లోనూ టీమ్‌ఇండియాదే విజయం. దీంతో.. ఐర్లాండ్‌పై వరుసగా ఆరో మ్యాచ్‌ను భారత్‌ జట్టు గెలపొందినట్టైంది.

Bumrah VS Ireland : అయితే ఈ సిరీస్​కు బుమ్రా కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఈ మ్యాచ్​లో మొదట బౌలింగ్‌లో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌తోనే ప్రసిద్ధ్‌, సిక్సర్​ కింగ్​ రింకూ సింగ్‌ టీ20 అరంగేట్రం చేశారు. దాదాపు ఏడిదా తర్వాత టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్​ బుమ్రా (2/24) తన మునుపటి ఫామ్‌నే చూపించాడు. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన అతడు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్'ను సొంతం చేసుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విజయం తర్వాత బుమ్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్​లో విజయం సాధించినప్పటికీ.. కొన్ని అంశాల్లో మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని అన్నాడు. "నేషనల్ క్రికెట్​ అకాడమీలో చాలా సెషన్లు ప్రాక్టీస్‌ చేశాను. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మంచిగా ఆడించడం హ్యాపీగా ఉంది. అందుకే కొత్తగా అన్నట్టుగా ఏమీ అనిపించలేదు. అందుకు కారణం సిబ్బంది నాకు అందిచిన సహాయ సహకారమే. ఇక ఈ మ్యాచ్​లో పిచ్​ స్వింగ్‌కు అనుకూలంగా మారింది. కాకపోతే వర్షం వల్ల పరిస్థితులు చాలా వేగంగా మారాయి. అయినా చివరికి మేమే విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఐర్లాండ్‌ కూడా ఎన్నో క్లిష్టపరిస్థితుల నుంచి తేరుకుని ఈ మ్యాచ్‌లను ఆడుతోంది. ఆ జట్టులోని ప్లేయర్లు మంచిగా ఆడారు. ఇక మేము గెలిచినప్పటికీ కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మా టీమ్​లో ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్​తో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడిన ఎక్స్​పీరియన్స్​ వారికి ఇక్కడ బాగా ఉపయోగపడింది. ఇలానే మిగతా మ్యాచుల్లోనూ బాగా ఆడి గెలుస్తాం" అని బుమ్రా పేర్కొన్నాడు.

IND VS Ireland First T20 Innings : ఐర్లాండ్‌ వికెట్లు ఇలా.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ జట్టు ఏడు వికెట్ల కోల్పోయి 139 పరుగుల స్కోర్​ చేసింది. బుమ్రా 2/24, ప్రసిధ్ 2/32, రవి బిష్ణోయ్ 2/23, అర్ష్‌దీప్‌ సింగ్ 1/35 వికెట్లు పడగొట్టారు.

ఇక ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, ఐదు సిక్స్‌లు నమోదు అయ్యాయి. బారీ మెకార్తీనే ఎక్కువగా బౌండరీలు(4) బాదాడు. ఆ తర్వాత క్యాంఫర్ మూడు, మార్క్‌ ఐదెర్ రెండు ఫోర్లు బాదారు. ఇక సిక్సుల్లో.. మెకార్తీ, క్యాంఫర్ మాత్రమే సిక్స్‌లు బాదారు. మెకార్తీ నాలుగు, క్యాంఫర్ ఒక సిక్స్‌ కొట్టారు.

మొదటి అర్ధ శతకం.. ఐర్లాండ్‌ 59/6తో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన బారీ మెకార్తీ (51*) మరో బ్యాటర్ క్యాంఫర్ (39)తో కలిసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మెకార్తీ.. తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.

భారత ఇన్నింగ్స్​లో ఫోర్లు, సిక్సులు.. ఐర్లాండ్‌ జట్టు నిర్దేశించిన 140 పరుగుల లక్ష్య ఛేదనను టీమ్​ఇండియా మంచిగానే ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ గైక్వాడ్ (19) మొదటి వికెట్‌కు 46 పరుగులు నమోదు చేశారు. యశస్వి.. ఐర్లాండ్ బౌలర్ యంగ్‌ చేతిలో పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. లెగ్‌సైడ్ వెళ్తున్న బాల్​ను కొట్టి కీపర్‌ చేతికి చిక్కాడు. అలా 6.5 ఓవర్లలో 47/2 స్కోరు చేసింది. అదే సమయంలో వర్షం పడడంతో... చివరికి రెండు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స్‌లు.. భారత ఇన్నింగ్స్​లో యశస్వి మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదగా.. రుతురాజ్ ఒక సిక్స్‌, ఒక ఫోర్ కొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.