ETV Bharat / sports

టీ20 సిరీస్​.. కెప్టెన్​ రోహిత్​ రెడీ.. కానీ ఆ స్టార్​ ఓపెనర్​ మాత్రం..

author img

By

Published : Jul 26, 2022, 4:21 PM IST

Teamindia vs West indies T20 series: ఈ నెల 29 నుంచి విండీస్​తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం కెప్టెన్​ రోహిత్​ శర్మ సిద్ధమయ్యాడు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి అతడు ట్రినిడాడ్‌ చేరుకొన్నాడు. అయితే ఈ సిరీస్​కు స్టార్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్ మిస్​ అయ్యాడు.

టీమ్ఇండియా టీ20 సిరీస్​
Teamindia T20 series

Teamindia vs West indies T20 series: వెస్టిండీస్ గడ్డపై శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే జట్టు దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన గబ్బర్ సేన 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకొని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఓ దేశంపై అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా చరిత్రకెక్కింది. అయితే ఈ నెల 29నుంచి విండీస్​తో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్​ను విశ్రాంతి పేరిట వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. దీని కోసం రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి అతడు ట్రినిడాడ్‌ చేరుకొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పోస్ట్​ చేసింది.

కెప్టెన్‌ రోహిత్‌, రిషభ్‌ పంత్‌, కార్తీక్‌, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ బస్సు నుంచి దిగి హోటల్‌ గదికి చేరుకొంటున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 21న అతడికి కొవిడ్‌ సోకినట్లు బీసీసీఐ నిర్ధారించింది. దీంతో ఇప్పుడు అతడు ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంది. గజ్జలో గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన రాహుల్.. మళ్లీ ఇప్పుడు కొవిడ్‌తో విండీస్‌ సిరీస్‌కు దాదాపు దూరమైనట్లే!

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్,రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌.

ఇదీ చూడండి: బ్యాడ్ న్యూస్​.. కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.