ETV Bharat / sports

టీమ్​ఇండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో గబ్బర్​ సింగ్​గా శిఖర్​ ధావన్​!

author img

By

Published : Mar 21, 2023, 2:51 PM IST

టీమ్​ ఇండియా స్టార్​ క్రికెటర్​ శిఖర్​ ధావన్​ ప్రస్తుతం క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. అయితే తాజాగా ఆయన పోలీస్​ డ్రెస్​ వేసుకుని దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
shikhar dhawan
shikhar dhawan

టీమ్​ ఇండియా స్టార్​ ప్లేయర్స్​ విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మలతో పాటు పోటా పోటీగా మైదానంలో విజృంభించిన శిఖర్​ ధావన్​ ఇప్పుడు క్రికెట్​కు దూరమయ్యాడు. ఐదు నెలల క్రితం టీమ్​ ఇండియా ఆడిన వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ తన చోటును కోల్పోయాడు. టీమ్‌కు దూరమైనప్పటికీ ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే అటు క్రికెట్​తో పాటు సినిమాల్లోనూ మెరిసే ఈ స్టార్​ ప్లేయర్​ ఇప్పుడు ఓ హిందీ సీరియల్‌లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.

ప్రముఖ హిందీ ఛానల్​లో ప్రసరామవుతున్న కుండలి భాగ్య అనే సీరియల్​లో ఆయన ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇందులో శిఖర్ ధావన్ ఓ పోలీస్ ఆఫీసర్​ పాత్రలో కనిపించనున్నాడట. పోలీస్ డ్రెస్సులో ఉన్న ధావన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్​ చల్​ చేస్తున్నాయి. అయితే మొదట్లో ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఇది ఐపీఎల్​ ప్రోమో కోసమని భావించారు. అయితే ఆయన సీరియల్​లో నటిస్తున్నాడని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అప్పట్లోనే ధావన్‌ ఓ బాలీవుడ్​ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డబుల్‌ ఎక్స్‌ఎల్‌' అనే సినిమాలో ధావన్‌ అతిథి పాత్రలో కనిపించాడు.

యంగ్ బ్యాటర్ శుభమన్​ గిల్ అద్భుత ప్రదర్శన వల్ల్ శిఖర్ ధావన్​కు వన్డేల్లో కూడా చోటు లభించలేదు. అయితే టెస్టు ఆరంగేట్ర మ్యాచ్‌లోనే 187 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన శిఖర్ ధావన్.. తన క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన ధావన్.. ఆ తర్వాత టీమ్‌లో తన చోటును కోల్పోయాడు. నిలకడగా రాణిస్తున్న శుభ్​మన్​ గిల్‌ను అతని స్థానంలో నిలబెట్టింది బీసీసీఐ.

shikhar dhawan
సీరియల్ నటుడితో శిఖర్​ ధావన్​

ఇక టీమ్​ ఇండియా తరుపున 34 టెస్టులు ఆడిన ధావన్, 40.61 సగటుతో 2315 పరుగులు స్కోర్​ చేశాడు. అందులో 7 శతకాలు, 5 అర్థ శతకాలు ఉన్నాయి. అంతే కాకుండా 167 వన్డేలు ఆడిన శిఖర్.. 44.11 సగటుతో 6793 పరుగులు సాధించాడు. అందులో 17 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి. కీలకమైన మ్యాచుల్లో అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన ధావన్​ 'మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్'గా పేరొందాడు. అయితే ఈ 37 ఏళ్ల స్టార్​ ప్లేయర్​ను వయసు, స్ట్రైయిక్ రేట్​ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్‌కు దూరం చేసిన బీసీసీఐ, 2022 తర్వాత ఏకంగా జట్టులోనే చోటు లేకుండా చేసింది. అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్, గత ఏడాది ఆరంభంలో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.

shikhar dhawan
శిఖర్​ ధావన్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.