ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్ భారమంతా ఇప్పుడు నాపైనే'

author img

By

Published : Oct 18, 2021, 5:02 PM IST

Hardik Pandya In T20 World Cup
టీ20 ప్రపంచ కప్​లో హార్దిక్ పాండ్యా

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ ప్రస్తుతం జట్టులో లేకపోవడం వల్ల టీ20 ప్రపంచ కప్​ భారమంతా తనపైనే ఉందని టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya In T20 World Cup) చెప్పాడు. ఈ టోర్నీ తన కెరీర్​లోనే అత్యంత పెద్ద బాధ్యత అని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్​లో ప్రత్యర్థులతో పోటీ పడేందుకు టీమ్​ఇండియా సిద్ధమవుతున్న వేళ.. భారత ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక విషయాలు వెల్లడించాడు. ఫినిషర్​గా తన కెరీర్​లో టీ20 ప్రపంచ కప్(Hardik Pandya In T20 World Cup) అత్యంత పెద్ద బాధ్యత అని తెలిపాడు. మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం జట్టులో లేకపోవడం వల్ల ఇప్పుడు పూర్తి భారం తనపైనే ఉందని పేర్కొన్నాడు.

"ఇప్పటివరకు నాపై ఉన్న అత్యంత పెద్ద బాధ్యత ఇదే అని చెప్పగలను. ఎందుకంటే.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ లేడు. భారమంతా నాపైనే ఉందని నేను అనుకుంటున్నా. అలా అనుకోవడం వల్ల అది నాకు ఛాలెంజింగ్​గా ఉంటుంది. టోర్నీలో పాల్గొనడం ఆనందంగా ఉంది."

- హార్దిక్, టీమ్ ఇండియా ఆల్​రౌండర్​

"నన్ను మొదటి నుంచి అర్థం చేసుకున్న వ్యక్తి ధోనీనే. నేను ఎలా ఆడతాను. నేను ఎలాంటి వ్యక్తి. నాకు ఏవి నచ్చవు.. వంటి విషయాలన్నీ ధోనీకి తెలుసు"అని హార్దిక్​ పేర్కొన్నాడు. 2019లో న్యూజిలాండ్​ పర్యటనలో టీవీ వివాదంలో చిక్కుకున్నప్పుడు తనకు ధోనీ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు.

"న్యూజిలాండ్​లో నాకు హోటల్ గదులు లేవు. కానీ, అప్పుడు ధోనీ నుంచి కాల్ వచ్చింది. నువ్వు నా దగ్గరకు వచ్చేయ్​. 'నేను బెడ్​ మీద పడుకోను. నువ్వు నా బెడ్​ మీద పడుకో. నేను కింద పడుకుంటా' అని చెప్పాడు. నాకు ఏదైనా అయితే.. ఎప్పడూ ముందుండే వ్యక్తి అతడు. నా గురించి అన్ని విషయాలు అతడికి తెలుసు. ధోనీకి నేను చాలా సన్నిహితుడిని. నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోనీ."

-హార్దిక్ పాండ్యా, టీమ్ ఇండియా ఆల్​రౌండర్​

తన క్రికెట్​ కెరీర్​లో ఎన్నోసార్లు ధోనీ తనను ఆదుకున్నాడని చెప్పాడు హార్దిక్​. "ఎంఎస్​ ధోనీని గొప్పవాడిగా నేనెప్పుడూ చూడలేదు. నాకైతే అతడు సోదరుడు. జీవిత మార్గదర్శి. ధోనీతో గడిపితే.. ఎవరైనా సరే పరిణితి చెందుతారు. వినయంగా మాట్లాడటం నేర్చుకుంటారు" అని హార్దిక్ చెప్పాడు.

2019లో సర్జరీ అనంతరం హార్దిక్​ పాండ్యా.. ఐపీఎల్​లోగాని, భారత జట్టులో కానీ రెగ్యులర్​గా బౌలింగ్​తో అదరగొట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఐపీఎల్​ సీజన్​లోనూ ఫిట్​నెస్​ సమస్యల కారణంగా అతడు​ పలు మ్యాచ్​లకు దూరమయ్యాడు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.