ETV Bharat / sports

నిరాశపరిచినా నెం.1 ప్లేస్​లోనే సూర్య.. మరి కోహ్లీ ఎన్నో స్థానంలో అంటే?

author img

By

Published : Apr 12, 2023, 8:29 PM IST

Updated : Apr 12, 2023, 8:44 PM IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో వరుస మ్యాచుల్లో విఫలమవుతున్న టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​ టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. మరి స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ ఎన్నో స్థానంలో ఉన్నాడంటే?

Etv suryakumar-yadav-continues-lead-icc-t20-batter-rankings
suryakumar-yadav-continues-lead-icc-t20-batter-rankings

ఐసీసీ టిీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానాన్ని టీమ్​ఇండియా స్టార్‌ బ్యాటర్​ సూర్య కుమార్‌ యాదవ్‌ నిలుపుకున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో సూర్య కుమార్‌ 906 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. సూర్య తర్వాత స్థానంలో పాకిస్థాన్​ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (811 పాయింట్లు) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​ (755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 748 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 745 పాయింట్లతో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే ఐదో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి, స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ 15వ స్థానంలో ఉన్నాడు. మిగతా టీమ్ఇండియా బ్యాటర్లు ఎవరూ టాప్‌-20లో చోటు దక్కించుకోలేకపోయారు.

అయితే ఇటీవలే ప్రారంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్​ జట్టు తరఫున ఆడుతున్న సూర్య కుమార్‌ యాదవ్​ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 1, 0 పరుగులు చేశాడు. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ కూడా ఉంది. అయితే సూర్య నెంబర్‌వన్‌ స్థానంలో కొనసాగాడానికి మ్యాచ్‌లు అంతర్జాతీయంగా మ్యాచ్‌లు జరగకపోవడమే కారణం.

త్వరలో పాకిస్థాన్​, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ప్రారంభమవనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్​లో సూర్య తర్వాత ఉన్న మహ్మద్​​ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్​లు ఆ టీ20 సిరీస్‌లో రాణిస్తే సూర్యను దాటే ఛాన్స్‌ ఉంది. బౌలింగ్‌ విభాగంలో అఫ్గానిస్థాన్​ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తొలి స్థానంలో ఉండగా.. ఫజల్లా ఫరుఖీ రెండు, జోష్‌ హాజిల్‌వుడ్‌ మూడు, వనిందు హసరంగ నాలుగో స్థానంలో ఉన్నారు. టీమ్​ఇండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోవడం గమనార్హం.

ప్రస్తుతం టీమ్​ఇండియా ప్లేయర్లు ఐపీఎల్​లో బిజీగా ఉన్నారు. మే నెల మధ్యలో ముగియనున్న ఈ సీజన్​ తర్వాత.. భారత్​ క్రికెట్​ జట్టు లండన్​ వెళ్లనుంది. అక్కడ ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియాకతో తలపడనుంది. అయితే స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమైన నేపథ్యంలో అతడికి బ్యాకప్‌గా ఉన్న సూర్య తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ పేలవ ఫామ్‌తో అతడిని సెలెక్టర్లు పక్కనపెట్టే అవకాశం ఉంది. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతుండటంతో అతడిని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పుజారా తన వైస్ కెప్టెన్సీని నిలబెట్టుకోనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో పుజారా వైస్ కెప్టెన్‌గా జట్టులో కొనసాగనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Last Updated :Apr 12, 2023, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.