ETV Bharat / sports

'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసిన రైనా.. బన్నీ నటనకు ఫిదా

author img

By

Published : Jan 23, 2022, 11:53 AM IST

Raina Srivalli song: అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలోని 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసి అలరించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Suresh RainaS Srivalli song, రైనా శ్రీవల్లి సాంగ్
Suresh Raina

Raina Srivalli song: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' చిత్రానికి సినీప్రియులే కాదు ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. 'పుష్పరాజ్‌'గా బన్నీ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్‌, పంచ్‌ డైలాగ్‌లు, మ్యూజిక్‌.. ఇలా ఆ సినిమాలోని చాలా విశేషాలు ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షించాయి. ఇందులో భాగంగానే మైదానంలో బ్యాటింగ్‌తో ఎంతోమంది క్రీడాభిమానులను సొంతం చేసుకున్న వార్నర్‌, జడేజా వంటి క్రికెటర్లు ఇటీవల సోషల్‌మీడియా వేదికగా 'తగ్గేదే లే' అంటూ నెటిజన్లను ఫిదా చేశారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వచ్చి చేరాడు. తాజాగా రైనా 'పుష్పరాజ్‌' అవతారమెత్తి నెటిజన్ల మదిదోచాడు.

'శ్రీవల్లి' అంటూ అచ్చు బన్నీలా స్టెప్పులేసి మెప్పించాడు రైనా. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఇతడు బన్నీ నటనను మెచ్చుకున్నాడు. "అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' ఇటీవల చూశాను. బ్రదర్‌.. నీ పెర్ఫార్మెన్స్‌ అత్యద్భుతంగా ఉంది. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. శ్రీవల్లి పాటను.. ఏదో అలా ప్రయత్నించాను" అంటూ ఆ పోస్ట్​కు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. 'సూపర్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అలాగే, యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఈ పాటకు స్టెప్పులేసిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి ఇవోనా దాదిక్.. ఫీల్డ్​లోనే కాదు బోల్డ్​నెస్​లోనూ సూపరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.