ETV Bharat / sports

T20 Worldcup: ఇంగ్లాండ్​కు షాక్​.. ఫైనల్​కు సౌతాఫ్రికా

author img

By

Published : Feb 24, 2023, 10:32 PM IST

Updated : Feb 24, 2023, 10:48 PM IST

South Africa reach maiden Women's T20 World Cup final with upset win over England
T20 Worldcup: ఇంగ్లాండ్​కు షాక్​.. ఫైనల్​కు సౌతాఫ్రికా

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్​లో ఇంగ్లాండ్​కు షాక్ ఇస్తూ తుది పోరుకు దూసుకెళ్లింది సౌతాఫ్రికా. దీంతో ఫైనల్​లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్​కు అర్హత సాధించింది. హోరాహోరీగా సాగిన సెమీస్​లో ఇంగ్లాండ్​కు షాక్ ఇస్తూ తుది పోరుకు దూసుకెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ టోర్న్​మెంట్​లో తొలిసారి ఫైనల్​కు చేరుకుంది సౌతాఫ్రికా. ఫలితంగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్​తో తలపడనుంది.

ఇకపోతే ఈ సెమీస్​ మ్యాచ్​లో 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి పరాజయం చెందింది. అయితే ఒక దశలో ఇంగ్లాండ్​ సూనాయసంగా గెలుపొందుతుందని అభిమానులు ఆశించారు. కానీ కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించడంతో ఇంగ్లీష్​ జట్టుకు ఓటమి తప్పలేదు. స్పీడ్‌స్టర్ అయబొంగా ఖాకా తన సూపర్​ బౌలింగ్‌తో.. సౌతాఫ్రికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తీసింది. మరో బౌలర్​ షబ్నమ్ ఇస్మాయిల్ కూడా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అయితే బ్యాటింగ్​లో ఇంగ్లాండ్​ జట్టుకు మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు డానిల్లె వ్యాట్, సోఫియా డంక్లే .. తొలి వికెట్‌కు 53 పరుగులు నమోదు చేశారు. ధాటిగా ఆడిన డంక్లే ఆరు ఫోర్లతో 28 రన్స్ చేసింది. వ్యాట్ కూడా ఆరు బౌండరీలతో 34 పరుగులు చేసింది. అలానే షివర్ 5 ఫోర్లతో 40 రన్స్​, కెప్టెన్ హీథర్ నైట్ రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించింది. కానీ వీరిద్దరూ ఔటైన తర్వాతే ఇంగ్లాండ్​ అసలు కష్టం మొదలైంది. వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

లౌరా, బ్రిట్స్‌ జోరు.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు కూడా మంచి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు లౌరా వల్‌వర్డ్, తజ్మిన్ బ్రిట్స్ బాగా ఆడారు. వీరిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు పరుగెత్తించారు. లౌరా 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 రన్స్ సాధించింది. బ్రిట్స్ అయితే ఆరు బౌండరీలు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులను చేసింది. అలా వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు నమోదు చేశారు. కాప్ 4 ఫోర్లతో అజేయంగా నిలిచి 27 రన్స్​ చేసింది. దీంతో సౌతాఫ్రికా తన నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు సాధించింది.

ఇదీ చూడండి: యంగ్​ క్రికెటర్​ మైండ్​ బ్లాక్​ రికార్డ్​.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..

Last Updated :Feb 24, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.