ETV Bharat / sports

యంగ్​ క్రికెటర్​ మైండ్​ బ్లాక్​ రికార్డ్​.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..

author img

By

Published : Feb 24, 2023, 7:35 PM IST

ఇంగ్లాండ్​ యంగ్​ బ్యాటర్​ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్​లో అద్భుతమైన రికార్డ్ సాధించాడు. 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆ వివరాలు..

Harry brook record
యంగ్​ క్రికెటర్​ మైండ్​ బ్లాక్​ రికార్డ్​.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

ఇంగ్లాండ్​ యంగ్​ బ్యాటర్​ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్​లో​ ​ సంచనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో​ బ్రూక్ హ్యారీ 169 బంతుల్లో 184 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది వందలకుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అలా 807 రన్స్​ చేశాడు. ఇప్పటివరకు అతడు ఆరు టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి నాలుగు సెంచరీలు బాదాడు. ఇక ఈ టెస్టుల్లో అతడు వందకుపైగా(100.88) సగటుతో కొనసాగుతుండటం విశేషం. ఇప్పటి వరకు మొదటి తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక రన్స్​ సాధించిన బ్యాటర్‌గా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వినోద్ కాంబ్లీ (798) పేరిట రికార్డ్​ ఉండేది. ఆ తర్వాత హెర్బర్ట్‌ సుట్ల్కిఫ్‌ (780), సునీల్‌ గావస్కర్‌ (778), ఎవర్టన్ వీకెస్​ను(777) బ్రూక్ అధిగమించాడు.

బ్రూక్ ఇన్నింగ్స్​

  • బ్రూక్ 2022, సెప్టెంబర్ 8న దక్షిణాఫ్రికాపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో 12 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్​లో అతడికి బ్యాటింగ్ అవకాశం రాలేదు.
  • ఆ తర్వాత పాకిస్థాన్ పర్యటనలో మంచి ప్రదర్శన చేశాడు. అక్కడ ఆడిన ఫస్ట్​ టెస్టులోనే 153, 87 పరుగులు చేశాడు. అనంతరం రెండు, మూడు టెస్టుల్లోనూ మరో రెండు శతకాలు బాదాడు.
  • ఇక న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​లలో 89, 54 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి తొమ్మిది ఇన్నింగ్స్ లో కలిపి ఇప్పటి వరకూ బ్రూక్ రన్స్ 807 రన్స్​ చేశాడు.

ఐపీఎల్ జాక్​ పాట్​.. అయితే హ్యారీ బ్రూక్​ ఇప్పటివరకు టీ20, వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అతడిని రీసెంట్​గా జరిగిన ఐపీఎల్​ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ రూ. 13.25 కోట్లను వెచ్చించి మరీ దక్కించుకుంది. దీంతో అతడు మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తరఫున ఈ మెగాలీగ్​ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇదీ చూడండి: సింధు షాకింగ్ నిర్ణయం.. కోచ్ పార్క్‌తో తెగతెంపులు.. కొత్తోడి కోసం వెతుకులాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.