ETV Bharat / sports

శార్దూల్​ పెళ్లిలో శ్రేయస్​ అయ్యర్​ హంగామా!

author img

By

Published : Feb 27, 2023, 3:32 PM IST

టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్​.. శార్దూల్​ ఠాకూర్ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. ఎందుకంటే తన స్నేహితులతో కలిసి అతడు పాటలు పాడుతూ స్టేజ్​పై హంగామా చేశాడు. ఆ వీడియో మీకోసం..

Shreyas Iyer sings song Shardul Thakur marriage
శార్దూల్ ఠాకూర్ పెళ్లిలో శ్రేయస్ అయ్యర్​ పాటలు

టీమ్​ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ నేడు(ఫిబ్రవరి 27) ముంబయిలో తన ఫియాన్సీ మిథాలీ పారుల్కర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన పండగ వాతవారణం కొద్ది రోజుల ముందు నుంచే ప్రారంభమైపోయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్​గా మెహందీ వేడుకలో శార్దూల్​ ఓ కుర్రాడితో కలిసి చేసిన ఓ మాస్​ డ్యాన్స్​ వీడియో వైరల్​ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సారి ప్రీ వెడ్డింగ్​ పంక్షన్​లో శార్దూల్​తో పాటు మరో టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్ కూడా​ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచాడు.

ఈ వేడుకలో అతడు తనదైన స్టైల్​లో హంగామా చేశాడు. కేకేఆర్​ టీమ్​ మేనేజ్​మెంట్​ సభ్యుడైన అభిషేక్​ నాయర్​తో కలిసి పాటలు పాడాడు. బ్రాహ్మాస్త్ర సినిమాలోని 'కేసరియా' సాంగ్​ను పాడి సర్​ప్రైజ్ చేశాడు. అలా శ్రేయస్​, నాయర్ తమ స్నేహితులతో కలిసి​ పాటలు పాడగా.. కాబోయే భార్య మిథాలీతో కలిసి శార్దూల్​ రొమాంటిక్​గా స్టెప్పులేశాడు. ఈ విధంగా కార్యక్రమమంతా సందడి సందడిగా సాగింది.

దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్​ కూడా జోడించింది. 'కేకేఆర్‌ అబ్బాయిలపై ఎవరైనా ఎలా మనసు పారేసుకోకుండా ఉంటారు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారగా.. నెటిజన్లు దీనిని ట్రెండ్ చేస్తూ.. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు. ఇకపోతే శ్రేయస్​ అయ్యర్​, శార్దూల్​ ఠాకూర్​.. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రేయస్‌ ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తుండగా.. శార్దూల్‌ జట్టు ప్లేయర్​గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ ముగిశాక.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రేయస్‌-శార్దూల్‌ భాగం కానున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున కలిసి ఆడనున్నారు.

ఇదీ చూడండి: ENG vs NZ: టెస్టు​ల్లో కేన్​ మామ కొత్త రికార్డు.. అతడే నంబర్​ వన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.