ETV Bharat / sports

బంగ్లాదేశ్​ స్టార్​ షకీబ్​ రికార్డు.. టెస్టుల్లో అత్యంత వేగంగా..

author img

By

Published : Dec 8, 2021, 6:45 PM IST

shakib al hasan news: బంగ్లాదేశ్ స్టార్​ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హసన్ మరో రికార్టు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 4వేల పరుగులు సహా 200 ప్లస్ వికెట్లు సాధించిన క్రికెటర్​గా నిలిచాడు.

shakib al hasan news
షకీబ్ అల్ హసన్

shakib al hasan news: మరో అరుదైన ఘనత సాధించాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్​రౌండర్ షకీబ్​ అల్ హసన్. టెస్టుల్లో 4000 పైచిలుకు పరుగులు సహా 200+ వికెట్లు సాధించాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్​గా నిలిచాడు.

ఇప్పటివరకు 59 మ్యాచ్​లు ఆడిన షకీబ్​.. 39.41 సగటుతో 4001 పరుగులు పూర్తి చేశాడు. 215 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా టెస్టు క్రికెట్​లో 4000+ పరుగులు సహా 200 వికెట్లు తీసినవారిలో ఆరో క్రికెటర్​గా నిలిచాడు. అతడి కన్నా ముందు గ్యారీ సోబర్స్​, ఇయాన్ బోథమ్, కపిల్​ దేవ్, జాక్వెస్ కలిస్, డేనియల్ వెటోరీ ఈ జాబితాలో ఉన్నారు.

ఇదీ చూడండి: Shakib: షకిబ్​ను విలన్‌గా చూపిస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.