ETV Bharat / sports

వరల్డ్​ నెం.3కు షాకిచ్చిన లక్ష్యసేన్​.. సింధు, సైనా ఔట్​

author img

By

Published : Mar 17, 2022, 10:52 PM IST

All England championship: ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​లో లక్ష్యసేన్​ జోరు చూపించి క్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. స్టార్​ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​ రెండో రౌండ్​లో ఓడిపోయారు.

All England championship
All England championship

All England championship Lakshya sen: ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ కాంస్య పతక విజేత లక్ష్యసేన్​.. ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​లో అదరగొట్టాడు. ప్రపంచ నెం.3 అండర్స్​ ఆంటోన్సెనను 21-16, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్​ ఫైనల్​కు దూసుకెళ్లాడు. ​క్వార్టర్స్​లో చైనాకు చెందిన లు జాంగ్​ జుతో తలపడనున్నాడు. భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం జర్మనీ జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. తెలుగు క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ తన రెండో రౌండ్‌లో ఆంథోనీ గింటింగ్‌తో తలపడుతున్నాడు. ప్రస్తుతం 21-9తో శ్రీకాంత్‌ తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు.

Saina nehwal: భారత స్టార్‌ షట్లర్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చుక్కెదురైంది. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలవాలనే కోరిక తీరకుండానే మరోసారి పీవీ సింధు, సైనా రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు. జపాన్‌కు చెందిన సయక తకహషి 21-19, 16-21, 21-17 తేడాతో సింధుపై విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌ 2 ర్యాంకర్‌ యమగుచి చేతిలో 21-14, 17-21,21-17 తేడాతో సైనా ఓటమిపాలైంది.

ఇదీ చూడండి: 'కోహ్లీకి ఇక ఏ ఒత్తిడి లేదు.. ప్రత్యర్థి జట్లకు కష్టమే!'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.