ETV Bharat / sports

ODI Worldcup: అశ్విన్​ కామెంట్స్​పై రోహిత్​ రియాక్షన్​.. అది సరైంది కాదంటూ..

author img

By

Published : Jan 18, 2023, 12:59 PM IST

Rohith sharma
ODI Worldcup: అశ్విన్​ కామెంట్స్​పై రోహిత్​ రియాక్షన్​.. అది సరైంది కాదంటూ..

వన్డే ప్రపంచకప్​ గురించి సీనియర్ క్రికెటర్​ రవిచంద్రన్ అశ్విన్​ చేసిన కామెంట్స్​పై స్పందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అలా చేయడం సరికాదని చెప్పాడు. ఆ వివరాలు..

భారత్‌ వేదికగా 2023 అక్టోబర్‌ నెలలో వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీ జరగనుంది. ఆ సమయంలో మంచు ప్రభావం కొద్దిగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఛేదన చేసే జట్టుకు లబ్ధి చేకూర్చుతుందని, బౌలింగ్‌ వేసే టీమ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. అందుకే మ్యాచ్‌ల సమయాన్ని కాస్త ముందుకు జరపాలని అంటున్నారు. ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా సీనియర్ ప్లేయర్​ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా సూచించాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు కాకుండా ఉదయం 11.30కే ప్రారంభించాలని అన్నాడు. లేకపోతే టాస్ కీలకంగా మారుతుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ విషయమై మాట్లాడాడు. ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో స్పందించాడు.

"ఇది మంచి ఆలోచనే. అయితే టాస్‌ మీదే ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రపంచకప్‌. కాస్త ముందుగానే మ్యాచ్‌ను ప్రారంభించాలనే ఆలోచన నాకు నచ్చింది. అయితే ఇది సాధ్యమవుతుందా..? లేదా..? అనేది నాకైతే తెలియదు. ప్రసారకర్తలు దానిని నిర్ణయిస్తారు (నవ్వుతూ). అయితే మ్యాచ్‌లో ఒకరికి ప్రయోజనం కలగడం మాత్రం సరైంది కాదు. మంచుతో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ అడ్వాంటేజ్‌ లేకుండా నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలని కోరుకోవాలి. అయితే ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉండవు. మ్యాచ్‌ను ముందుగా ప్రారంభించాలనే ఆలోచన మాత్రం బాగుంది" అని రోహిత్‌ వెల్లడించాడు. కాగా, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది.

ఇదీ చూడండి: ఉప్పల్ క్రికెట్​​ స్టేడియంలోకి ఇవి తీసుకెళ్తే రానివ్వరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.