ETV Bharat / sports

హిట్​మ్యాన్​పై మాజీలు ఫైర్​- 'రోహిత్ శర్మ చేసిన పెద్ద తప్పు అదే'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 3:27 PM IST

Etv Bharat
Etv Bharat

Rohit Sharma South Africa Series : సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య హోరా హోరీ మ్యాచ్​ జరుగుతోంది. అయితే ఇందులో రెండో రోజు సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన ఫామ్ కనబరిచి దూసుకెళ్లింది. దీంతో నిరాశ చెందిన టీమ్ఇండియా మాజీలు రోహిత్ శర్మపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Rohit Sharma South Africa Series : సాతాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య హోరా హోరీ మ్యాచ్​ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైన టీమ్ఇండియా నిర్దిష్ట ఓవర్లసకు 245 చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా 11 తేడాతో పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

దీంతో ఇప్పుడు టీమ్ఇండియా పర్ఫామెన్స్​పై మాజీలు మండిపడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ పేలవ ప్లాన్స్​ వల్ల ఇదంతా జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మ్యాచ్​లో బౌలర్లను ఉపయోగించిన తీరు నిరాశగా ఉందంటూ చెప్పుకుంటున్నారు. లంచ్ బ్రేక్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం టీమ్​ఇండియా ఇబ్బందుల్లో పడుతోందంటూ మండిపడుతున్నారు.

''ఏ సెషన్ ప్రారంభంలో అయినా మొదట అత్యుత్తమ బౌలర్లతో ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ప్రయత్నించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు మేం ఇదే విషయాన్ని చాలా సార్లు చర్చించుకున్నాం. కానీ ఈ సారి రోహిత్ అలా చేయలేదు. లంచ్ బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలను బౌలింగ్​కు దింపాడు. వీరిద్దరితో బౌలింగ్ స్ట్రాటజీ ప్లాన్​ చేయడం వ్యూహాత్మకంగా అతి పెద్ద తప్పు. ఇలా చేసి ఉండకపోతే భారత్ ఆ సెషన్ తొలి అరగంటలోనే పైచేయి సాధించేది'' అని రవిశాస్త్రి తన అభిప్రయాన్ని వెల్లడించాడు.

మరోవైపు క్రికెట్ క్రిటిక్,మాజీ ప్లేయర్ సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా ఇదే అభిప్రాయాన్న వ్యక్తం చేశాడు. "టీమ్ఇండియా ఈ విషయంలో పొరపాటు చేసింది. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ తప్పకుండా దీనిపై దృష్టిసారించాలి. బ్రేక్‌ సమయంలో వారిద్దరు కలిసి మాట్లాడుకునే ఇలా ప్రసిధ్‌, శార్దూల్‌ చేత బౌలింగ్‌ చేయించి ఉంటారు" అంటూ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

అయితే రోహిత్ ప్లాన్​పై సౌతాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్‌ మరోలా స్పందించాడు. "బుమ్రాకు కాస్త రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత బౌలింగ్‌ చేయించుకోవాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ భావించి ఉంటారు. అయితే భారత్‌ మాత్రం మంచి అవకాశాలు చేజార్చుకుంది. లంచ్ తర్వాత సౌతాఫ్రికా వేగంగా 42 పరుగులు సాధించి తమ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చింది" అంటూ ఫిలాండర్‌ తెలిపాడు.

తేలిపోయిన టీమ్ఇండియా బౌలర్లు - రెండో రోజు సఫారీలదే పైచేయి

రోహిత్ ముందు గోల్డెన్ ఛాన్స్- 17 ఏళ్లలో ఇదే తొలిసారి- భారత్xసౌతాఫ్రికా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.