ETV Bharat / sports

రోహిత్ నోరు జారి ఉంటాడు: పాక్​ మాజీ క్రికెటర్

author img

By

Published : Mar 10, 2022, 9:14 PM IST

Rohit Sharma: టీమ్​ఇండియా సారథి రోహిత్ శర్మ మాట జారి ఉంటాడని అన్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్​. స్టార్​ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ను 'ఆల్ ​టైం గ్రేట్' అంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశాడు.

rohit sharma
ind vs sl

Rohit Sharma: అశ్విన్​ను 'ఆల్​టైం గ్రేట్'​గా వర్ణిస్తూ టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నోరు జారాడని అన్నాడు పాకిస్థాన్​ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్. అశ్విన్​ ఆ ఘనత దక్కించుకునేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పాడు.

rohit sharma
రోహిత్-అశ్విన్

"అశ్విన్​ గొప్ప బౌలర్​ అనడంలో సందేహం లేదు. అతడు తన బౌలింగ్​లో వేరియేషన్స్​ తీసుకొచ్చాడు. భారత్​లో అతడు అత్యుత్తమ స్పిన్నర్​. అయితే విదేశాల్లో మాత్రం.. రోహిత్​ ప్రకటనతో నేను అంగీకరించను. కానీ, కుంబ్లే, జడేజా, గతంలో బిషన్​ సింగ్​ బేడీ మాత్రం విదేశీ గడ్డపై అదరగొట్టారు. రోహిత్ మాట జారి ఉంటాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడానికి అది ఒక పద్ధతి."

-రషీద్ లతీఫ్, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్

rohit sharma
టీమ్​ఇండియా

ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడు టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మాజీ సారథి కపిల్‌దేవ్‌ (434) రికార్డును అధిగమించాడు. అనిల్‌కుంబ్లే (619) వికెట్లతో అందరికన్నా ముందుండగా అశ్విన్‌ (436) ఇప్పుడు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టు అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇదీ చూడండి: Test Rankings 2022: టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.