ETV Bharat / sports

టీమ్ఇండియా​ నుంచి పంత్​ రిలీజ్​.. గాయమా? లేక క్రమశిక్షణా చర్యలా?

author img

By

Published : Dec 5, 2022, 3:57 PM IST

టీమ్​ఇండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ను జట్టు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పంత్​ను టీమ్​ నుంచి రిలీజ్​ చేయడానికి ఓ కారణం ఉందని సమాచారం. అదేంటంటే..

rishabh pant released
rishabh pant released

టీమ్​ఇండియా ప్లేయర్ రిషబ్‌ పంత్‌ను వన్డే జట్టు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పంత్​కు గాయమైందా..? లేదా మరేదైనా కారణమా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
పంత్​ను విడుదల చేస్తూ.. "బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్‌ను విడుదల చేశారు. టెస్టు సిరీస్‌కు అతడు తిరిగి జట్టుతో చేరతాడు" అని బోర్డు పేర్కొంది. ఈ మేరకు.. వన్డే సిరీస్ నుంచి తనను రిలీజ్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను పంత్ కోరాడని సమాచారం. ఈ విషయం గురించి పంత్.. కెప్టెన్​​ రోహిత్​ శర్మ, కోచ్​ రాహుల్​ ద్రవిడ్​తో చర్చించాడని తెలుస్తోంది. పంత్ ఇలా అడగడానికి కచ్చితమైన కారణమేంటో బీసీసీఐ చెప్పలేదు. కానీ, క్రమశిక్షణా చర్యలు మాత్రం కాదని తెలుస్తోంది.

అయితే రిషబ్​ పంత్​ విడుదలపై టీమ్​ఇండియా బ్యాటర్​ కేఎల్​ రాహుల్​ స్పందించాడు. "నిజం చెప్పాలంటే.. నాకు కూడా పంత్​ విషయం పూర్తిగా తెలియదు. ఆతడిని విడుదల చేస్తున్న విషయం నాకు డ్రెస్సింగ్​ రూమ్​లోనే తెలిసింది. కానీ దానికి కారణం ఎంటో నాకు తెలియదు. బహుశా.. ఈ ప్రశ్నకు మెడికల్ టీమ్​ వద్ద సమాధానం దొరుకుతుందేమో" అని చెప్పుకొచ్చాడు.

కాగా ఇప్పటి వరకు పంత్ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి తీసుకోని అన్ని ఫార్మాట్ల ఆటగాడు పంత్‌ మాత్రమే. ఇకపోతే న్యూజిలాండ్ పర్యటనలో పంత్ విఫలం కావడంతో నెటిజన్లు యువ క్రికెటర్‌ను ట్రోల్ చేశారు. దీంతో బీసీసీఐ కావాలనే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి పంత్‌కు అవకాశాలు ఇస్తోందనే ఆరోపణలొచ్చాయి. ఈ కారణంతోనే పంత్ బ్రేక్ తీసుకొని ఉండొచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి : ఫీలైన రోహిత్ శర్మ.. ఆ విషయం నేర్చుకోవాలంటూ..

కేఎల్​ రాహుల్​, సుందర్​ ఎందుకలా చేశారో అర్థం కాలేదు: దినేశ్​ కార్తిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.