IPL 2022: ఐపీఎల్​ రిటెన్షన్.. ఏ జట్టులో ఎవరెవరంటే?

author img

By

Published : Nov 26, 2021, 5:46 AM IST

Updated : Nov 26, 2021, 6:16 AM IST

RCB set to retain Virat Kohli, Glenn Maxwell , కోహ్లీ, మాక్స్​వెల్​ను రిటైన్​ చేసుకోనున్న ఆర్సీబీ

rcb retain kohli: 2022 ఐపీఎల్​ మెగావేలానికి ముందు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ సారథి కోహ్లీ, గ్లెన్​ మాక్స్​వెల్​ను రిటైన్​ చేసుకోనుందని తెలిసింది. దీనితో పాటు మిగతా జట్లు ఎవరెవరిని రిటైన్​ చేసుకోనున్నాయంటే?

rcb retain kohli: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. 2022 ఐపీఎల్​ మెగావేలానికి ముందు మాజీ సారథి కోహ్లీ, గ్లెన్​ మాక్స్​వెల్​ను​(ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​) రిటైన్​ చేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లకు తాము రిటైన్​ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నవంబరు 30 వరకు సమయం ఉంది. ఈ టీమ్స్​ గరిష్ఠంగా నలుగురు ప్లేయర్స్​ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. వీరిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు.

కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్​.. రిటెన్షన్​లు ముగిసిన తర్వాత వేలానికి ముందు తమ కొత్త ఆటగాళ్లను ఎంచుకుంటారు. ఈ టీమ్స్​కు ముగ్గురు ప్లేయర్స్​ను తీసుకునే అవకాశం ఉంది. వారిలో ఇద్దరు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాడు ఉంటాడు.

మిగతా జట్లు ఎవరెవరిని రిటైన్​ చేసుకోనున్నారంటే?

సీఎస్కే: ధోనీ, జడేజా, మొయిన్​ అలీ, రుతురాజ్​ గైక్వాడ్​

కేకేఆర్​: సునీల్​ నరైన్​, రసెల్​, గిల్​ లేదా వెంకటేశ్​ అయ్యర్​, వరుణ్​ చక్రవర్తి

ఆర్సీబీ: కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్​వెల్​, చాహల్​

దిల్లీ క్యాపిటల్స్:​ పంత్​, పృథ్వీ షా, నోర్జే, అవేశ్​ ఖాన్​ లేదా అక్షర్ పటేల్​

రాజస్థాన్​ రాయల్స్:​ బెన్​ స్టోక్స్​, సంజూ శాంసన్​, జాస్​ బట్లర్​

సన్​రైజర్స్​ హైదరాబాద్:​ రషీద్​ ఖాన్​, జానీ బెయిర్​ స్టో లేదా కేన్​ విలియమ్స్​న్​

ముంబయి ఇండియన్స్​: రోహిత్​ శర్మ, ఇషాన్​ కిషన్​, బుమ్రా, కీరన్​ పొలార్డ్​

పంజాబ్​ కింగ్స్​: కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​, రవి బిష్ణోయ్​

రిటైన్​ ప్లేయర్స్​ ధర ఎంతంటే?

ప్రతి జట్టు పర్సులో రూ.90కోట్లు ఉంటాయి. ఒక్కో జట్టు నలుగురు ప్లేయర్స్​ను రిటైన్​ చేసుకోవాలంటే రూ.42 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ముగ్గురైతే రు.33 కోట్లు , ఇద్దరికి రూ.22 కోట్లు, ఒక్కరికి రూ.14కోట్లు వెచ్చించాలి.

ఇదీ చూడండి: ట్రోలర్స్​కు దీటుగా సమాధానమిచ్చిన పాక్​ సారథి

Last Updated :Nov 26, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.