ETV Bharat / sports

Ravichandran Ashwin Vs Australia : '20 నెలల తర్వాత అశ్విన్​ను ఎంచుకోవడానికి కారణమిదే'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 11:26 AM IST

Ravichandran Ashwin Vs Australia : ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్​కు అశ్విన్​ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఏమన్నాడంటే?

Ravichandran Ashwin Vs Australia : '20 నెలల తర్వాత అశ్విన్​ను ఎంచుకోవడానికి కారణమిదే'
Ravichandran Ashwin Vs Australia : '20 నెలల తర్వాత అశ్విన్​ను ఎంచుకోవడానికి కారణమిదే'

Ravichandran Ashwin Vs Australia : ప్రపంచ కప్​నకు ముందు సన్నాహాకాల మ్యాచుల్లో భాగంగా టీమ్​ఇండియా స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. సెప్టెంబర్‌ 22న మొహాలీ వేదికగా జరగనున్న మొదటి వన్డేతో ఈ సిరీస్‌ షురూ కానుంది. తాజాగా ఈ సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అనౌన్స్ చేసింది.

అయితే ఈ జట్టులో ఎవరూ ఊహించని విధంగా సీనియర్​ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు సెలక్టర్లు చోటు కల్పించడం విశేషం. దీంతో అశ్విన్​.. దాదాపు 20 నెలల తర్వాత వన్డే టీమ్​లో చోటు దక్కించుకున్నాడు. అతడు చివరి సారిగా 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌ బరిలో దిగాడు. అయితే అశ్విన్‌ను జట్టు కోసం ఎంపిక చేయడంపై టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ఎందుకు ఎంపిక చేశారో వివరించాడు.

"అశ్విన్‌ ఎంత అనుభవజ్ఞుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఇప్పటికే కెరీర్​లో 113 వన్డేలు, 94 టెస్టు మ్యాచులు ఆడాడు. అతడు ఎప్పుడూ మా దృష్టిలోనే ఉంటాడు. అశ్విన్​ మాకు మంచి ఎంపిక. గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్‌లో లేకపోవచ్చు. కానీ దేశీవాళీ టోర్నీలతో పాటు టెస్టు క్రికెట్‌లో మంచిగా ఆడుతున్నాడు. ఆసీస్​ సిరీస్‌కు అశ్విన్​కు మంచి ఛాన్స్. మరి అతడు ఏ స్థాయిలో ఉన్నాడా అన్నది ఈ సిరీస్‌తో మాకు సమాధానం దొరుకుతుంది" అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

Ind Vs Aus Odi Series 2023 : ఇకపోతే ఆసీస్​తో జరగబోయే సిరీస్​లో​ మొదటి రెండు వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. వారికి సెలక్టర్లు రెస్ట్ కల్పించారు. మళ్లీ ఈ ముగ్గురు తిరిగి మూడో వన్డేలో ఆడనున్నారు. దీంతో మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ టీమ్​ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

Ind Vs Aus Odi Series 2023 Schedule : వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ ఇలా..

  • తొలి వన్డే : సెప్టెంబర్ 22, 2023 శుక్రవారం. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్‌ బింద్రా స్టేడియం, మొహలి వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.
  • రెండో వన్డే : సెప్టెంబర్ 24, 2023 ఆదివారం. హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.
  • మూడో వన్డే: సెప్టెంబర్ 27, 2023 బుధవారం. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుందీ మ్యాచ్.

లైవ్​ ఎందులో అంటే.. ఈ టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ను స్పోర్ట్స్ 18 ఇంగ్లీష్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఇంకా జియో సినిమాలో మ్యాచ్‌ను ఉచితంగా చూడొచ్చు.

ఆస్ట్రేలియా సిరీస్​కు భారత్ జట్టు ప్రకటన.. తొలి రెండు మ్యాచ్​లకు స్టార్లు దూరం.. ఆ ఇద్దరికి మళ్లీ నిరాశే!

Pujara Suspension : వాళ్లు చేసిన పనికి పుజారాపై వేటు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.