ETV Bharat / sports

హార్దిక్ కెప్టెన్సీపై అశ్విన్ కీలక కామెంట్స్​.. అలా ఉండాలని..

author img

By

Published : Jan 6, 2023, 9:09 PM IST

హార్దిక్​ పాండ్య కెప్టెన్సీపై రవిచంద్రన్​ అశ్విన్, గంభీర్​, మాజీ బ్యాటింగ్‌ కోచ్ సంజయ్‌ బంగర్‌ స్పందించారు. కీలక కామెంట్స్​ చేశారు. ఏం అన్నారంటే..

Ravichandran Ashwin hardik pandya
హార్దిక్ కెప్టెన్సీపై అశ్విన్ కీలక కామెంట్స్​.. అలా ఉండాలని..

రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేనప్పుడు హార్దిక్ పాండ్య భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో అతడే కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడి సారథ్యంలో టీమ్​ఇండియా ఏడు టీ20ల్లో బరిలో దిగగా.. శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో మాత్రమే ఓటమిపాలైంది. అంతకుముందు న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్‌ టై అయింది.

ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య కెప్టెన్సీ సామర్థ్యంపై టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడాడు. హార్దిక్‌ చాలా కూల్‌గా ఉంటాడని, జట్టును రిలాక్స్‌గా ఉంచుతాడని చెప్పాడు. 'హార్దిక్‌ చాలా తెలివైన క్రికెటర్. అతడిలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. చాలా కూల్‌గా, రిలాక్స్‌గా ఉంటాడు. కాబట్టి.. ఇది జట్టు వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇలా ఉంటే ఆటగాళ్లు కలిసి కట్టుగా బాగా రాణిస్తారని భావిస్తున్నా' అని అశ్విన్‌ చెప్పాడు.

శ్రీలంకతో రెండో టీ20లో భారత్‌ ఓటమి తర్వాత హార్దిక్ కెప్టెన్సీ గురించి టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడాడు. ప్రతి మ్యాచ్‌ తర్వాత ఆటగాడిని అంచనా వేయకూడదని గంభీర్ అన్నాడు. "హార్దిక్ మంచి ఆటగాడు. ప్రతి మ్యాచ్‌ తర్వాత ఆటగాళ్ల గురించి అంచనా వేయకూడదు. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయినంత మాత్రాన.. అతడు విఫలమయ్యాడని భావించకూడదు. నో బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేకపోయాడు. అలా చేయకుండా ఉండటం బౌలర్ల బాధ్యత. ఇప్పటివరకు అతడు కెప్టెన్‌గా సక్సెస్‌ అయ్యాడని భావిస్తున్నా. చాలా రిలాక్స్‌గా ఉండి తన ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడు" అని గంభీర్‌ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్య.. బౌలర్‌గా భారత క్రికెట్ జట్టుకు ఎంతో విలువైన ఆస్తి అని, తన బౌలింగ్‌ని ఎంతో మెరుగు పరుచుకున్నాడని భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. అతడు ఔట్‌స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌లను కలుపుతూ విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: భారత్​ నుంచి మరో గ్రాండ్​ మాస్టర్​.. ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.