ETV Bharat / sports

Rahul Dravid: ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్​గా వద్దు!

author img

By

Published : Jul 9, 2021, 3:46 PM IST

Rahul Dravid
ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్‌

అంతర్జాతీయ స్టార్ల కన్నా కుర్రాళ్లకే రాహుల్​ ద్రవిడ్​ మార్గనిర్దేశం అవసరమని మాజీ క్రికెటర్ వసీమ్​ జాఫర్ అన్నాడు. అండర్​-19, భారత్​-ఏ కోచ్​గానే ద్రవిడ్​ కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. ఒక అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఆయన తనకు తానుగా వెళ్లొద్దన్నాడు.

టీమ్‌ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గానే కొనసాగాలని మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ అంటున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా ఆయన రిజర్వు బెంచ్‌ను పటిష్ఠం చేయడమే మంచిదని పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్టార్ల కన్నా కుర్రాళ్లకే ఆయన మార్గనిర్దేశం అవసరమని అభిప్రాయపడ్డాడు. ఈ అభిప్రాయాన్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించాడు.

"రాహుల్‌ ద్రవిడ్‌కు ఇంతకన్నా ఎక్కువ ఘనతే దక్కాలి. ఎన్‌సీయే ప్రధాన కోచ్‌గా ఆయన పనితీరు అద్భుతం. అండర్‌-19, భారత్‌-ఏ, గాయపడి ఎన్‌సీయేకు వెళ్లిన అంతర్జాతీయ ఆటగాళ్లకు ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. వారికి అంతకు మించిన ఆదర్శనీయుడు ఎవరూ దొరకరు"అని జాఫర్‌ అన్నాడు.

ఆయన మార్గనిర్దేశం అవసరం..

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా వెళ్లాడు. ఈ సిరీసుతో కుర్రాళ్లు తప్పక ప్రయోజనం పొందుతారు. అయితే ఒక అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఆయన తనకు తానుగా వెళ్లొద్దని నా అభిప్రాయం. అండర్‌-19, ఎన్‌సీయేకు వచ్చే క్రికెటర్లకు ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే టీమ్‌ఇండియాకు ఆడుతున్న వారు ఎదిగారు. అండర్‌-19, భారత్‌-ఏ క్రికెటర్లు తర్వాతి స్థాయికి ఎదిగేందుకు ఆయన మార్గనిర్దేశం అవసరం’ అని వసీమ్‌ అన్నాడు.

లంక పర్యటనకు ఎంపికైన క్రికెటర్లకు జాఫర్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇదీ చదవండి : 'టీమ్​ ఇండియా నెక్స్ట్​ కోచ్​గా అతడే బెస్ట్​'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.