ETV Bharat / sports

అశ్విన్​పై అజ్మల్ సంచలన ఆరోపణలు.. ఏమన్నాడంటే?

author img

By

Published : Jun 14, 2021, 7:58 PM IST

ajmal, ashwin
అజ్మల్, అశ్విన్​

పాకిస్థాన్ మాజీ బౌలర్​ సయీద్ అజ్మల్​.. ఐసీసీతో పాటు టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సస్పెన్షన్​ విధించాల్సి వస్తుందనే అశ్విన్​ను క్రికెట్​ నుంచి తాత్కాలికంగా దూరంగా ఉంచారని ఆరోపించాడు. ​

టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ​ బౌలర్​ సయీద్​ అజ్మల్​. అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​పై కూడా విమర్శలు కురిపించాడీ పాక్ క్రికెటర్.

అశ్విన్ బౌలింగ్ యాక్షన్​ కారణంగా అతనిపై ఐసీసీ నిషేధం విధించాల్సి ఉందని పేర్కొన్నాడు. అందుకే అతన్ని కొంతకాలం క్రికెట్​ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారని అజ్మల్ ఆరోపించాడు. ఐసీసీ వేర్వేరు క్రికెటర్లకు విభిన్న నిబంధనలు అమలు చేస్తుందని తెలిపాడు.

"ఐసీసీ.. ఎవరిని అడిగి నిబంధనలు మారుస్తుంది. నేను గత 8 ఏళ్లుగా క్రికెట్​ ఆడుతున్నా. ఇవన్నీ నా కోసమేనా. నాకైతే అలానే అనిపిస్తుంది. నిషేధం విధించిన ఆ ఆరు నెలలు అశ్విన్​ను ఉద్దేశపూర్వకంగా క్రికెట్​కు దూరంగా ఉంచారు. ఎందుకలా చేశారు? మీ బౌలర్​ను సస్పెండ్​ కాకుండా ఉండటానికి. ఒక పాకిస్థాన్​ బౌలర్​పై నిషేధం విధిస్తే వారికేంటి. వారికి కావాల్సింది డబ్బులు మాత్రమే."

-సయీద్​ అజ్మల్, పాకిస్థాన్ క్రికెటర్.

ఇదీ చదవండి: పీఎస్ఎ​ల్​ మ్యాచ్​లపై ఏపీలో బెట్టింగ్.. నలుగురి అరెస్ట్​

అజ్మల్​ బౌలింగ్ శైలి కారణంగా ఐసీసీ అతడిని పలుమార్లు క్రికెట్ నుంచి నిషేధించింది. తనతో పాటు అశ్విన్ శైలి కూడా భిన్నంగా ఉంటుందని అజ్మల్ ఆరోపిస్తున్నాడు. అతడిపై కూడా నిషేధం విధించాలని అతడు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాడు.

2010లో క్రికెట్ అరంగేట్రం చేసిన అశ్విన్​.. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 600 వికెట్ల క్లబ్​లో చేరాడు. టెస్టుల్లో 409 వికెట్లు పడగొట్టాడు. బంతితో పాటు బ్యాట్​తోనూ రాణిస్తూ లోయర్​ ఆర్డర్​లో ఉపయుక్తమైన బ్యాట్స్​మన్​గా ఉన్నాడు.

ఇదీ చదవండి: ఆ టీషర్ట్​ వేసుకున్నందుకు రైనాకు ద్రవిడ్ మందలింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.