ETV Bharat / sports

Shahid afridi: తాలిబన్లపై పాక్​ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్​!

author img

By

Published : Aug 31, 2021, 1:14 PM IST

తాలిబన్లు సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ పాక్​ మాజీ క్రికెటర్​ షాహిద్​ అఫ్రిది (shahid afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాలిబన్లు క్రికెట్​ను ఇష్టపడతారని భావిస్తున్నానని తెలిపాడు.

shahid afridi,షాహిద్​ అఫ్రిదీ
Shahid afridi: తాలిబన్లపై పాక్​ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్​!

పాకిస్థాన్​ మాజీ కెప్టెన్, క్రికెటర్​ షాహిద్​ అఫ్రిది (shahid afridi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దురాక్రమణకు పాల్పడి అఫ్గానిస్థాన్​లో అల్లకల్లోలం సృష్టించిన తాలిబన్లకు అఫ్రిది మద్దతు తెలిపాడు. తాలిబన్లు.. సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారని, మహిళలను ఉద్యోగానికి అనుమతిస్తున్నారని పేర్కొన్నాడు.

  • ❝Taliban have come with a very positive mind. They're allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban's next PM. pic.twitter.com/OTV8zDw1yu

    — Naila Inayat (@nailainayat) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'వాళ్లకి క్రికెట్​ అంటే ఇష్టం!'

తాలిబన్లు.. క్రికెట్​ను కూడా ఇష్టపడతారని భావిస్తున్నానని అఫ్రిది తెలిపాడు. క్రికెట్​కు మద్దతుగా నిలవడమే కాకుండా పాకిస్థాన్​తో క్రికెట్​ సిరీస్​లపై కూడా సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి : Ranji trophy 2021: రంజీ ట్రోఫీ గ్రూప్స్​పై బీసీసీఐ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.