ETV Bharat / sports

అవి బంతులా.. బుల్లెట్లా.. ఉమ్రాన్​ దెబ్బకు బుమ్రా రికార్డ్​ బ్రేక్​

author img

By

Published : Jan 4, 2023, 4:29 PM IST

లంకతో జరిగిన తొలి టీ20లో ఉమ్రాన్​ మాలిక్​ అరుదైన రికార్డ్​ సాధించాడు. దీంతో బుమ్రా పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆ వివరాలు..

Pace sensation Umran Malik clocks 155 kmph, becomes fastest Indian bowler
అవి బంతులా.. బుల్లెట్లా.. ఉమ్రాన్​ దెబ్బకు బుమ్రా రికార్డ్​ బ్రేక్​

శ్రీలంకతో ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో 2 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 3 మ్యాచ్‍‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్​ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో శివమ్ మావి 4/27తో అదరగొట్టగా.. యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లతో అతడికి తోడుగా నిలిచాడు. దీంతో పాటే ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ డాసున్​ శనకను ఔట్ చేసిన బంతిని అతడు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఆఫ్ సైడ్ దిశగా వస్తున్న ఆ బంతిని శనక ఎక్స్‌ట్రా కవర్‌లో ఆడగా.. చాహల్ ఆ బంతిని క్యాచ్​ పట్టాడు. దీంతో శనకా పెవిలియన్ చేరాడు. దీంతో అతడు 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఈ మార్క్​తో.. అంతుకుముందు అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన భారత బౌలర్‌గా బుమ్రా పేరిట ఉన్న రికార్డును ఉమ్రాన్ మాలిక్ అధిగమించాడు. బుమ్రా గతంలో అత్యధికంగా గంటకు 153.35 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగా... మహ్మద్​ షమీ గంటకు 153.3 కిలోమీటర్ల వేగంతో, నవదీప్ సైనీ గంటకు 152.85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశారు. తాజాగా వీరందరినీ అధిగమించి ఉమ్రాన్​ కొత్త రికార్డ్​ క్రియేట్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్​ఇండియా నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో విజయానికి లంకకు 13 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 10 పరుగులే ఇచ్చి మంచి ప్రదర్శన చేశాడు.

ఇదీ చూడండి: 'టెస్టుల్లోకి వచ్చేది అప్పుడే'.. హార్దిక్​ ఆసక్తికర సమాధానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.