ETV Bharat / sports

'టీమ్​ఇండియా అందుకే బాగా ఆడుతోంది'

author img

By

Published : Aug 21, 2021, 5:55 PM IST

టీమ్​ఇండియా బలంగా ఉండటానికి గల కారణాన్ని వివరించాడు మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్​. ప్లేయర్స్.. ఇతర భాషలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా అంతా ఏకతాటిపై ఉన్నారని అన్నాడు.

teamindia
టీమ్​ఇండియా

టీమ్‌ఇండియాలో ఐక్యత మరింత కనిపిస్తోందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆటగాళ్లంతా ఒక బృందంగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. ఇతర భాషలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా అంతా ఏకతాటిపై కనిపిస్తున్నారని ఆనందించాడు.

"ఒకసారి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ చూడండి. విరాట్‌ కోహ్లీతో కలిసి ఇషాంత్‌ శర్మ తిరుగుతున్నాడు. అతడే ఉమేశ్‌ యాదవ్‌తో తిరగడమూ మనం చూశాం. వారిద్దరివీ వేర్వేరు మనస్తత్వాలు కానీ కలిసే తిరుగుతున్నారు. హార్దిక్ పాండ్యతో కలిసి రిషభ్ పంత్‌ బయటికి వెళ్లాడు. అందులో ఒకరిది పశ్చిమ భారత దేశం. మరొకరిది ఉత్తర భారత దేశం. తూర్పు నుంచీ కొందరు ఉన్నారు. మీరు దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌, హార్దిక్‌ను చూడండి. వారు మంచి మిత్రులు. ఒకరికి ఇంగ్లిష్‌ రాదు. మరొకరికి హిందీ రాదు. అయినా వారి స్నేహం బలంగా ఉంది. టీమ్‌ఇండియా ఈ తరంలో ఎందుకింత బాగా ఆడుతోందంటే కారణం ఇదే. వారంతా కలిసికట్టుగా ఉన్నారు. ఐపీఎల్‌ సైతం ఇందుకు దోహదం చేసింది" అని పార్థివ్‌ తెలిపాడు.

ప్రస్తుతం టీమ్‌ఇండియా జోరు మీదుంది. ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉంది. మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసి విజయం అందించడం ప్రత్యేకం.

ఇదీ చూడండి: IPL 2021 : ఆర్​సీబీలో భారీ మార్పులు.. జట్టుకు కొత్త కోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.