ETV Bharat / sports

ODI World Cup 2023 IND VS AFG : రోహిత్​ సెన్సేషనల్​ సెంచరీ... టీమ్ఇండియా వరుసగా రెండో విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 9:03 PM IST

Updated : Oct 11, 2023, 9:48 PM IST

ODI World Cup 2023 IND VS AFG : వరల్డ్ కప్​లో భాగంగా నేడు(సెప్టెంబర్ 11) జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా విజయం సాధించింది. మ్యాచ్ వివరాలు..

ODI World Cup 2023 IND VS AFG :
ODI World Cup 2023 IND VS AFG :

ODI World Cup 2023 IND VS AFG : వన్డే వరల్డ్ కప్​ 2023లో టీమ్​ ఇండియా వరుసగా రెండో మ్యాచ్​లో విజయం సాధించింది. తొలి మ్యాచ్​లో ఆసీస్​పై గెలుపొందిన భారత ఆటగాళ్లు.. తాజాగా అప్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో విజయాన్ని అందుకున్నారు. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు... 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్లు తేడాతో విజయం సాధించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ( 84 బంతుల్లో 131; 16x4, 5x6) 'శత'క్కొట్టడంతో సచిన్ రికార్డ్ కూడా బ్రేక్​ అయింది. అలాగే అతడు 63 బంతుల్లోనే ఈ సెంచరీ మార్క్‌ను అందుకుని వరల్డ్​ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇషాన్ కిషన్​(47 బంతుల్లో 47; 5x4, 2x6) హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(55*; 56 బంతుల్లో 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్​(25) కూడా స్కోర్ బోర్డును పరుగెత్తించారు. అప్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్​ వికెట్లు తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్​ చేసిన అప్గానిస్తాన్​ నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (21), ఇబ్రహీం జాద్రాన్‌ (22), రహమత్ షా (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (62; 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్​ ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మహ్మద్‌ నబీ (19), రషీద్‌ఖాన్‌ (16), ముజీబుర్‌ రెహ్మన్‌ (10*), నవీనుల్ హక్‌ (9*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య 2, శార్దూల్ ఠాకూర్​, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ICC Latest ODI Rankings Kohli : అదరగొట్టిన కోహ్లీ - కేెఎల్ రాహుల్​.. ఏకంగా..

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

Last Updated : Oct 11, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.