ETV Bharat / sports

రంజీ ట్రోఫీలో మెడల్ ప్రజెంటేషన్- క్రికెట్​లో పతకం ఇదే తొలిసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 10:17 PM IST

Updated : Jan 12, 2024, 10:45 PM IST

Medal In Cricket: డొమెస్టిక్​ క్రికెట్​లో కొత్త పద్ధతికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. రంజీ ట్రోఫీ మ్యాచ్​ల్లో ఇప్పటినుంచి ఆటగాళ్లకు మెడల్స్ ఇవ్వనన్నట్లు తెలిపింది.

Medal In Cricket
Medal In Cricket

Medal In Cricket: క్రికెట్​లో సాధారణంగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు ఉంటాయి. అయితే క్రికెట్​లో కొత్త పద్ధతికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తొలిసారి డొమెస్టిక్​ క్రికెట్​లో మెడల్​ (పతకం)ను ప్రవేశపెట్టింది. జనవరి 5నుంచి 2024 ఎడిషన్ రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్​లో ఇప్పటి నుంచి ప్రతీ గేమ్​​లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న ఆటగాడికి మెమొంటో, ప్రైజ్ మనీ​తో పాటుగా అదనంగా ఈ మెడల్​ను ఇవ్వనున్నారు.

'ఇతర క్రీడల్లో అథ్లెట్లకు మెడల్స్ బహుకరిస్తారు. వారి విజయాలకు చిహ్నంగా పతకాలను చూపిస్తూ సంతోషిస్తారు. అలాగే డొమెస్టిక్​ క్రికెట్​లో మన ప్లేయర్లకు కూడా పతకాలు ఇవ్వాలని నిర్ణయించాం. నగదు బహుమతితోపాటే ఈ మెడల్ అందిస్తాం. దీంతో తమ ఇంటికి తీసుకెళ్లడానికి పతకం ఓ గుర్తుగా ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కాగా ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్​మనీ రూ.25 వేలుగా ఉంది.

Ranji Trophy Participation: బీసీసీఐ డొమెస్టిక్ టోర్నీలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా క్రికెట్​లో మార్పులు తీసుకురానుంది. అంతర్జాతీయ మ్యాచ్​లు లేని సమయంలో టీమ్ఇండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ సొంత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల ఈటీవీ భారత్​తో తెలిపారు.

'టీమ్ఇండియా ప్లేయర్లు ఇంటర్నేషనల్ సిరీస్​లు, మ్యాచ్​లు లేని సమయంలో అవకాశం ఉన్నప్పుడల్లా ఆయా ఆటాగళ్లు తమ తమ రాష్ట్రాల తరఫున రంజీలో ఆడాల్సి ఉంటుంది. ఏ ప్లేయరైన సరైన కారణం లేకుండా రాష్ట్ర జట్టుకు ఆడకపోతే, జాతీయ జట్టు ఎంపికలో వారిని పరిగణలోకి తీసుకోం. ఫ్యూచర్​లో ఒక ప్లేయర్ డొమెస్టిక్ లీగ్​ల పెర్ఫార్మెన్స్​ను దృష్టిలో ఉంచుకొనే టీమ్ఇండియాకు సెలెక్ట్ చేస్తాం. అప్పట్లో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ సైతం అంతర్జాతీయ మ్యాచ్​ల నుంచి రెస్ట్ ఉన్నప్పుడు రంజీ​ టోర్నీల్లో ఆడేవారు. మరి ఇప్పటి తరం ప్లేయర్లు ఎందుకు ఆడారు? అందుకే రంజీ ట్రోఫీలో కచ్చితంగా ఆడాల్సిందేనని చెబుతున్నాం' అని సెలెక్షన్ కమిటీ మెంబర్​ చెప్పారు.

నెట్స్​లో సూర్య ప్రాక్టీస్ గాయం నుంచి స్పీడ్ రికవరీ

ప్లేయర్లంతా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే- లేదంటే టీమ్ఇండియాలో నో ఛాన్స్!

Last Updated :Jan 12, 2024, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.