ETV Bharat / sports

భారత అభిమానులపై మ్యాక్స్​వెల్​ భార్య​ ఫైర్​- మీ ఆగ్రహాన్ని వాటిపై చూపించండి అంటూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 5:56 PM IST

Updated : Nov 20, 2023, 6:17 PM IST

Maxwell Wife Vini Raman Slams Indian Fans
Maxwell Wife Vini Raman Slams Indian Fans

Maxwell Wife Vini Raman Slams Indian Fans : వరల్డ్ కప్​ ఫైనల్​లో టీమ్ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆ తర్వాత తనకు వచ్చిన విద్వేషపూరితమైన మెసేజ్​లపై ఆసీస్​ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ భార్య విని రామన్ స్పందించింది. భారత క్రికెట్ అభిమానులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Maxwell Wife Vini Raman Slams Indian Fans : భారత క్రికెట్ అభిమానులపై.. ఆస్ట్రేలియా వరల్డ్​ కప్​ టీమ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ భార్య విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆసీస్​, భారత్​ను ఓడించిన తర్వాత​ తనకు వచ్చిన విద్వేషపూరితమైన మెసేజ్​లపై స్పందించిన రామన్​.. ఉన్నతంగా ప్రవర్తించండి అంటూ హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్టు పెట్టింది.

"ఉన్నతంగా ప్రవర్తించండి. నేను ఇలా చెబుతున్నానని నమ్మలేకపోతున్నాను. మీరు భారతీయులు అయి ఉండవచ్చు. కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని కూడా గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త టీమ్​ను, మీ బిడ్డకు తండ్రిని. (తెలివితక్కువ వాళ్లు) ఒక చిల్​ పిల్​ వేసుకుని మీ ఆగ్రహాన్ని ప్రపంచ సమస్యలపై చూపించండి" అని విని రామన్ తీవ్రంగా స్పందించింది.

ఆదివారం టీమ్ఇండియా ఫైనల్​లో ఓడిపోవడం వల్ల కోట్లాది మంది భారత అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే వినిరామన్​ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. విని ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగింది. ఆదివారం ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్​ కప్​ గెలిచిన తర్వాత.. ఆ దేశానికి సపోర్ట్​ చేసింది. అయితే అందుకు భారత అభిమానులు ఆమెను ట్రోల్​ చేయడం వల్ల.. విని రామన్ తిరిగి స్పందించింది. తాను ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగినట్లు వివరించింది.

Vini Raman Glenn Maxwell Wedding : గ్లెన్​ మ్యాక్స్​వెల్, వినిరామన్​ 2022 మార్చి 18న క్రిస్టియన్​ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 27 చెన్నైలో తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. గత సెప్టెంబర్​లో విని రామన్​ మగబడ్డికు జన్మనిచ్చింది.
ఇదిలా ఉండగా.. గ్లెన్​ మ్యాక్స్​వెల్ ఈ వరల్డ్​ కప్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆదివారం మ్యాచ్​లో చివర్లో వచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అంతుకుముందు లీగ్​ స్టేజ్​లో అఫ్గానిస్థాన్​లో జరిగిన మ్యాచ్​లో డబుల్​ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 40 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన శతకం బాదడం విశేషం.

వరల్డ్​కప్ ట్రోఫీపై కాళ్లేసి ఫోజులు- మార్ష్​పై నెటిజన్లు ఫైర్ - ఇండియన్స్​ను చూసి నేర్చుకోవాలంటూ!

'నిన్న మన రోజు కాదు మేము మళ్లీ పుంజుకుంటాం' షమీ ఎమోషనల్ పోస్ట్​!

Last Updated :Nov 20, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.