ETV Bharat / sports

'సచిన్​ తెందూల్కర్​ ముఖ్యమంత్రి కావాలి'.. ఐస్​క్రీం వ్యాపారి వినూత్న ప్రచారం!

author img

By

Published : Mar 29, 2023, 8:32 PM IST

క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను కాబోయే ముఖ్యంమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాడు ఓ వీరాభిమాని. ఇందుకోసం తన వంతుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. ఆ కథెంటో తెలుసకుందాం..

man campaign in pune for sachin as maha cm
మహారాష్ట్ర సీఎంగా సచిన్​ను చూడాలని వ్యక్తి ప్రచారం

క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ను భవిష్యత్​లో సీఎంగా చూడాలని ఆశ పడుతున్నాడు మహారాష్ట్ర పుణెకి చెందిన ఓ ఐస్​క్రీం వ్యాపారి. అంతేకాకుండా సచిన్​ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. ఇందుకోసం తాను వ్యాపారం చేస్తున్న స్థలాన్నే ఎంచుకున్నాడు. ఇంతకీ ఇతడికి ఎందుకీ ఆలోచన వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

పుణెలోని ఎరవాడ ప్రాంతానికి చెందిన వినోద్ మోరే కుటుంబంతో కలిసి 30 సంవత్సరాలుగా ఐస్​క్రీం వ్యాపారం చేస్తున్నాడు. అయితే, వినోద్​కు.. సచిన్ తెందూల్కర్‌ను మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ. ఇందుకోసం బహిరంగ ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. దీంట్లో భాగంగానే తన దుకాణం రూపురేఖలను పూర్తిగా మార్చేశాడు. ఇతడి షాప్​ను చూస్తే.. ఇది ఐస్​క్రీం దుకాణమా లేదా సచిన్​ ఫొటో మ్యూజియమా అనిపించక మానదు. అంతలా తన దుకాణాన్ని సచిన్ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశాడు. తన షాప్​ చుట్టూ సచిన్​ ఫొటోలే కాకుండా సచిన్​ సీఎం కావాలని చేపట్టిన బహిరంగ ప్రచారాల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలను కూడా అతికించాడు. అలాగే ఈ ప్రచారానికి సంబంధించి తన కస్టమర్​లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ డైరీని కూడా అందుబాటులో ఉంచాడు. ఇందులో భిన్న రకాల అభిప్రాయాలను చూడవచ్చు.

man campaign in pune for sachin as maha cm
తన షాప్​కి సచిన్​ పేరు పెట్టుకున్న వినోద్ మోరే
man campaign in pune for sachin as maha cm
సచిన్​ సీఎం కావాలంటూ టోపీ ధరించిన వినోద్ మోరే

ఇలా మొదలైంది ఈ ప్రచారం..
మహారాష్ట్రలో 2019 తర్వాత ప్రభుత్వాలు మారాయి. రాష్ట్రంలో నెలకొన్న పొలిటికల్ డ్రామాతో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు వేసిన విలువైన ఓట్లను పరిగణలోకి తీసుకోవడం లేదని భావించాడు వినోద్​ మోరే. ఈ కారణంగానే భవిష్యత్​లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలన చేసే నాయకుడే ముఖ్యమంత్రిగా రావాలని.. ఆ సత్తా కేవలం ఒక్క క్రికెటర్​ సచిన్​కి మాత్రమే ఉందని అంటున్నాడు వినోద్​. ఇందుకోసమే ఐదు నెలల క్రితమే సచిన్ తెందూల్కర్​ కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారాన్ని ప్రారంభించాడు వినోద్​ మోరే.

man campaign in pune for sachin as maha cm
సచిన్​ ఫొటో మ్యూజియంను తలపిస్తున్న వినోద్ మోరే దుకాణం
man campaign in pune for sachin as maha cm
తన దుకాణాన్ని సచిన్​ ఫొటోలతో నింపిన వినోద్ మోరే

"నా షాప్ చుట్టూ సచిన్ ఫొటోలను ఉంచినప్పుడు.. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. అయితే క్రికెట్‌లో సచిన్ తెందూల్కర్​ ప్రదర్శించిన ప్రతిభ నేడు దేశం పేరును ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది ప్రజలందరికీ తెలుసు. ఇదే విధంగా రాష్ట్రంలో సచిన్ ముఖ్యమంత్రి ఐతే రాష్ట్ర రూపురేఖలను కచ్చితంగా మార్చగలడు. నేను చేపట్టిన ఈ ప్రచారం గురించి నా కస్టమర్లు అడగడం ప్రారంభించారు. క్రమంగా సచిన్​పై ఉన్న అభిమానంతో వారు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు సచిన్​ తెందూల్కర్​ ఒక్కడనే అని వీరు కూడా అభిప్రాయపడ్డారు. ప్రచారం ప్రారంభించిన ఈ ఐదు నెలల్లో దాదాపు 1500 మంది ఫొటోలు దిగి క్యాంపెయిన్​లో పాల్గొన్నారు."

- వినోద్​ మోరే, సచిన్​ తెందూల్కర్​ వీరాభిమాని

సచిన్​ కోసం షాప్​ పేరునే మార్చాడు..
తనకిష్టమైన సచిన్​ మాస్ క్యాంపెయిన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఉన్న తన షాప్​ పేరునే మార్చాడు వినోద్​. దీనికి 'సచిన్ మలై' అనే పేరు పెట్టినట్లు మోరే తెలిపాడు. ఈ ప్రచారం కారణంగానే పుణె నగరంలోని 'మాన్సీ మలై ఐస్​ గోలా' అనే మా దుకాణం ప్రసిద్ధి చెందిందని చెబుతున్నాడు మోర్. నగరం నలుమూలల నుంచి ప్రజలు వినోద్​ షాప్​న​కు వెళ్తుంటారు. ఇక్కడ రూ.50 నుంచి రూ.500 వరకు అనేక వెరైటీల ఐస్​క్రీంలు అందుబాటులో ఉంటాయి.

man campaign in pune for sachin as maha cm
తన దుకాణాన్ని సచిన్​ ఫొటోలతో నింపిన వినోద్ మోరే

"చాలా కాలం నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను. అప్పటి నుంచే సచిన్ తెందూల్కర్​కు నేను వీరాభిమానిని. ఈయన ఆడే మ్యాచ్​లు చూసేందుకు మా షాప్​లో ప్రత్యేకంగా టీవీని కూడా ఏర్పాటు చేశాను. నేనెప్పుడూ వారిని(సచిన్​)ను కలవలేదు. కానీ ఈ క్యాంపెయిన్​ ద్వారానైనా సచిన్​ను కలవాలనుకుంటున్నాను. ఆయన్ను కలిశాక.. తనని ముఖ్యమంత్రిగా చూడాలన్న నా కోరిక గురించి కూడా ఆయనకు చెప్పాలని ఉంది." అని వినోద్​ మోరే తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.