ETV Bharat / sports

విరాట్​ కోహ్లీ హాఫ్​ సెంచరీ చేయక 10ఏళ్లా?

author img

By

Published : Mar 4, 2023, 11:55 AM IST

kohli half century
కోహ్లీ హాఫ్​ సెంచరీ చేయక 10ఏళ్లు!

బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ తన మార్క్​ను చూపించలేకపోతున్నాడు. అతడు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ కలిపి అత్యధిక స్కోర్‌ 44 మాత్రమే. అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఇలాంటి ప్రదర్శననే చాలా ఏళ్లుగా చేస్తున్నాడు. కనీసం హాఫ్​ సెంచరీ కూడా చేయలేకపోతున్నాడు. ఆ వివరాలు..

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ.. బోర్డర్ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. ఒక్కప్పుడు ఆసీస్​పై విజృంభించిన కోహ్లీ.. ప్రస్తుతం మాత్రం ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో బోల్తా పడ్డాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ కలిపి విరాట్​ అత్యధిక స్కోర్‌ 44 మాత్రమే చేశాడు. మొత్తంగా 111 రన్స్ చేశాడు.

వాస్తవానికి 2020-21 కాలంలో ఫామ్‌లేమితో తీవ్రంగా ఇబ్బంది పడిన టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ.. ఆసియా కప్‌ 2022తో తిరిగి గాడిలో పడిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆఫ్ఘానిస్థాన్‌పై సెంచరీతో అదరగొట్టిన విరాట్​.. తనలోని పాత కోహ్లీని బయటకు తీశాడు. సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు ఆస్ట్రేలియాపై బాగా ఆడతాడనుకుంటే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అసలతడు ఈ టెస్ట్ ఫార్మాట్​లో శతకం బాది ముడేళ్లకు పైగానే అయింది. 2019 నవంబరులో బంగ్లాదేశ్​పై కొట్టాడు.

శతకం విషయం పక్కనపెడితే తాజా టోర్నీలో విరాట్​ కనీసం అర్ధశతం కూడా చేయలేదు. అయితే అది ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు. అతడు ఈ హాఫ్‌ సెంచరీ చేయక ఏకంగా పదేళ్లు ఏళ్లు అయిపోయింది. స్వదేశంలో ఆసీస్​పై అతడు అర్ధ శతకం బాదక పదేళ్లు గడిచిపోయాయి. గతంలో 2013లో స్వదేశంలో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్​లో కంగారులపై హాఫ్‌ సెంచరీ 67* బాదాడు. కానీ ఆ తర్వాత నుంచి చేతులెత్తేస్తున్నాడు. 2013 తర్వాత స్వదేశంలో ఆసీస్​పై తన చివరి 10 ఇన్నింగ్స్‌లో .. వరుసగా 0, 13, 12, 15, 6, 12, 44, 20, 22, 13 రన్స్​ మాత్రమే చేశాడు. అయితే ఇదే సమయంలో ఆసీస్​ను వారి గడ్డపై మాత్రం బాగానే ఎదుర్కొంటున్నాడు.

అలా అతడికి ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో మంచి రికార్డులు ఉన్నాయి. కానీ, స్వదేశంలో ఆడే టెస్టుల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. మరి అహ్మాదాబాద్‌ వేదికగా ఆసీస్​తో జరిగే ఆఖరి టెస్టు మ్యాచులోనైనా విరాట్​ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని, సెంచరీ బాదాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్​ గావస్కర్ ట్రోఫీలో టీమ్​ఇండియా తొలి రెండు టెస్టుల్లో మంచి విజయాన్ని అందుకుంది. స్పిన్​ మాయాజాలంతో స్పిన్ పిచ్​లపై ఆసీస్​ జట్టును మట్టికరిపించింది. అయితే అదే ఫార్ములాతో ఆసీస్​ కూడా మూడో టెస్టులో టీమ్​ఇండియాను గట్టి దెబ్బ తీసింది.

ఇదీ చూడండి: ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి సన్నిధిలో విరుష్క జంట పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.