ETV Bharat / sports

మూడో అతిపెద్ద స్టేడియం.. బీసీసీఐ రూ.100 కోట్ల సాయం

author img

By

Published : Jul 3, 2021, 5:20 PM IST

మరో భారీ క్రికెట్ స్టేడియానికి భారత్​ వేదిక కానుంది. రాజస్థాన్​లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం నిర్మించనున్నారు. ఇందుకోసం భారత క్రికెట్ బోర్డు రూ.100 కోట్ల సాయాన్ని అందించనుంది.

largest cricket stadium
అతిపెద్ద క్రికెట్ స్టేడియం

ఇటీవల మొతేరాతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించిన భారత్​.. మరో భారీ క్రికెట్​ మైదానానికి వేదిక కానుంది. 75 వేల మంది సీటింగ్​ సామర్థ్యంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం రాజస్థాన్​లో నిర్మించనుంది. జైపూర్​లో ఈ స్టేడియం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రాజస్థాన్ క్రికెట్ సంఘానికి (ఆర్​సీఏ) రూ.100 కోట్ల గ్రాంట్ అందించనుంది బీసీసీఐ. అహ్మదాబాద్​లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​ క్రికెట్ గ్రౌండ్​ తర్వాత అతిపెద్ద స్టేడియం ఇదే కానుంది!

  • Board of Control for Cricket in India (BCCI) to give Rs 100 crore infrastructure grant to Rajasthan Cricket Association (RCA) for the development of stadium in Jaipur.

    — ANI (@ANI) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుంది ఆర్​సీఏ. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జైపూర్​ శివారులో చోప్​ గ్రామంలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్​సీఏ.. కార్పొరేట్​ బాక్స్​ల విక్రయం ద్వారానూ నిధులను సమీకరించనుంది.

  • Historic day for cricket in Rajasthan- went to JDA for getting the lease deed and possession letter from JDC Gaurav Goyal for the land for India’s second largest cricket stadium proposed at Jaipur. Also present were GS Sandhu, Advisor, Mahendra Sharma, Secy and others. pic.twitter.com/Lhj92xIusR

    — Vaibhav Gehlot (@VaibhavGehlot80) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అత్యాధునిక సౌకర్యాలతో..

ప్రపంచస్థాయి వసతులు, అధునాతన సౌకర్యాలతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఇండోర్​ గేమ్స్​, శిక్షణ అకాడమీలు, క్లబ్​ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్​ గ్రౌండ్లు నిర్మించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరు నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: పాండ్యాకు కపిల్ చురకలు.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.