ఆ అనుభవం తర్వాత పనికొచ్చింది: క్రికెటర్ కేఎస్ భరత్

author img

By

Published : Oct 24, 2021, 8:33 AM IST

ipl 2021 news

ఐపీఎల్​ (ipl 2021 news) ఒక మెరుపు మెరిసిన యువ క్రీడాకారుడు (Ks bharat biography) కోన శ్రీకర్​ భరత్​. తన అద్భతమైన షాట్స్​తో అందరినీ మెప్పించగలిగాడు. మరి ఈ విశాఖ కుర్రాడి కథేంటో తెలుసుకుందామా?

ఆఖరి బంతికి 5 పరుగులు.. ఆ దశలో అద్భుతం జరిగితే తప్ప బ్యాటింగ్‌ జట్టు గెలవలేదు. ఇటీవల ఐపీఎల్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి అలాంటి అద్భుతమే చేశాడు ఆర్సీబీ బ్యాట్స్‌మన్‌, తెలుగు యువకుడు కోన శ్రీకర్‌ భరత్‌. తన బ్యాటింగ్‌, కీపింగ్‌ నైపుణ్యాలతో టీమ్‌ ఇండియా వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు (Ks bharat biography) ఈ విశాఖ కుర్రాడు.

అప్పుడు వద్దన్నారు!

వైజాగ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేటపుడు సీనియర్లను(Ks bharat batting) నెట్స్‌లో గమనించేవాణ్ని. బాల్‌బాయ్‌గా, స్కోర్‌బోర్డ్‌ దగ్గరా ఉండేవాణ్ని. సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ లాంటి దిగ్గజాల్ని చూసి స్ఫూర్తి పొందేవాణ్ని. సెయింట్‌ అలోసియస్‌ స్కూల్లో చదువుకున్నా. బుల్లయ్య కాలేజీ నుంచి డిగ్రీ చేశా. ఎంబీఏ కూడా పూర్తిచేశా. చదువులోనూ ముందుండే వాణ్ని. అయితే క్రికెట్‌ మీద ఇంకా ఎక్కువ ఇష్టం ఉండేది. అండర్‌-16లో కొన్ని మ్యాచ్‌లలో రాణించలేకపోయేసరికి జట్టులో స్థానం కోల్పోయా. నాన్న ఆందోళన చెంది.. క్రికెట్‌ మానేయమన్నారు. కోచ్‌ కృష్ణారావు సర్‌ నాన్నతో మాట్లాడటం వల్ల కొనసాగనిచ్చారు.

ipl 2021 news
కుటుంబంతో భరత్

కిట్‌ అమ్మ తెచ్చేది..

నాన్న శ్రీనివాసరావు విశాఖ నేవీ(Ks bharat native place) డాక్‌యార్డ్‌లో ఉద్యోగి. అమ్మ దేవి గృహిణి. అక్క మనోజ్ఞ. చిన్నపుడు గల్లీ క్రికెట్‌ ఆడేవాణ్ని. ఇరుగుపొరుగు ఇళ్ల కిటికీలకి బంతి తగిలితే వచ్చి అమ్మకు చెప్పేవారు. ఈ తలనొప్పి ఎందుకని ఏడేళ్లపుడు క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. నెట్స్‌లో ప్రాక్టీసు, పెద్ద గ్రౌండ్‌లో ఆడటం అప్పట్నుంచీ అలవాటైంది. పదేళ్లప్పుడే జిల్లా, రాష్ట్ర అండర్‌-13 జట్లకు ఎంపికయ్యా. మా స్కూలు సిటీకి ఒక చివర ఉంటే క్రికెట్‌ గ్రౌండ్‌ మరో చివర ఉండేది. మధ్యలో ఇల్లు. రోజూ సాయంత్రం బస్టాప్‌లో అమ్మ క్రికెట్‌ కిట్‌తో రెడీగా ఉండేది. మూడేళ్లపాటు నాతోపాటు అలా రోజూ వచ్చేది.

వికెట్‌ కీపింగ్‌...

నన్ను బాట్స్‌మన్‌గా, కీపర్‌గా తీర్చిదిద్దింది 'ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌' కోచ్‌ కృష్ణారావు. చిన్నప్పట్నుంచీ ఆయన దగ్గరే శిక్షణ తీసుకుంటున్నా. మిడిల్‌ ఆర్డర్‌ నుంచి నన్ను టాప్‌ ఆర్డర్‌కు తెచ్చారు. సిల్లీ పాయింట్‌, షార్ట్‌ లెగ్‌ పొజిషన్లలో ఫీల్డింగ్‌ చేస్తూ చురుగ్గా కదిలేవాణ్ని. ఇది గమనించి కీపర్‌గానూ ప్రయత్నించమన్నారు. అండర్‌-19 ఆంధ్ర జట్టుకు ఆడినప్పుడు మొదటిసారి వికెట్‌ కీపింగ్‌ చేశా. రంజీ జట్టులో కీపర్‌గా కొనసాగుతున్నా. చిన్నపుడు ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్న కీపింగ్‌ ప్రాక్టీసును దగ్గరగా చూసేవాణ్ని. ఎప్పుడైనా సరదాగా గ్లవ్స్‌ తీసుకుని ప్రాక్టీసు చేస్తుండేవాణ్ని. ఆ అనుభవం తర్వాత పనికొచ్చింది.

ఐపీఎల్‌ అనుభవం..

విరాట్‌ భాయ్‌, ఏబీ డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ లాంటి దిగ్గజాల ఆటను చూస్తూ చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది ఈసారి ఐపీఎల్‌లో వీరితో కలిసి బ్యాటింగ్‌ చేశా. దిల్లీతో చివరి మ్యాచ్‌లో మూడు బంతులు ఉన్నపుడు 'సింగిల్‌ చేసి స్ట్రైకింగ్‌ ఇవ్వమంటావా' అని మ్యాక్స్‌వెల్‌ను అడిగితే, 'వద్దు నువ్వే షాట్‌కు ప్రయత్నించు' అన్నాడు. స్పిన్‌కంటే ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆడటానికి ఇష్టపడతాను. స్పిన్‌ బౌలింగ్‌లో అయితే బంతిని గట్టిగా కొట్టాలి. అదే ఫాస్ట్‌ బౌలింగ్‌లో అయితే బంతిని సరిగ్గా టైమింగ్‌ చేస్తే చాలు. అందుకే ఆరోజు ఆఖరి బంతిని సిక్సర్‌గా కొట్టగలిగా. అమ్మానాన్న, అక్క, నా శ్రీమతి అంజలితోపాటు కోచ్‌ ప్రోత్సాహమే నన్ను (Ks bharat wife) ముందుకు నడిపిస్తోంది.

ipl 2021 news
భార్యతో భరత్​

ఆ ట్రిపుల్‌ ప్రత్యేకం..

వైజాగ్‌లో మొదటి రంజీ మ్యాచ్‌ జరిగినపుడు అమ్మానాన్న స్టేడియానికి వచ్చారు. ఆరోజు సెంచరీ చేశాను. జీవితంలో మర్చిపోలేని రోజది. 2015(ఒంగోలు)లో గోవాపైన ట్రిపుల్‌ సెంచరీ కూడా చాలా ప్రత్యేకం.. రంజీల్లో ఇండియా వికెట్‌ కీపర్‌కు అది అత్యధిక స్కోర్‌. ఇండియా-ఏ తరఫున విదేశీ జట్లపైన కొన్ని అద్భుతమైన మ్యాచ్‌లు ఆడా. 2019లో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికయ్యా. ఆడే అవకాశం రాలేదు కానీ, టీమ్‌ ఇండియాకి ఎంపికైనందుకు గర్వంగా ఫీలయ్యా. తర్వాత మళ్లీ అంతగా గుర్తుండిపోయేవి ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లే.

ఇదీ చదవండి:తొలి టీ20 ప్రపంచకప్​లో ఆడారు.. ఇప్పుడూ ఆడుతున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.