ETV Bharat / sports

సిక్సులు కొడుతూ కెప్టెన్ ధోనీ బిజీ బిజీ

author img

By

Published : Apr 5, 2021, 9:43 PM IST

Dhoni smashes sixes during CSK's net session
సిక్సులు కొడుతూ ధోనీ బిజీ బిజీ

ప్రాక్టీసులో భాగంగా స్టేడియం నలుమూలలకు సిక్సులు కొడుతూ కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ వీడియోను చెన్నై సూపర్​కింగ్స్.. ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ ధోనీ.. ఈసారి ఐపీఎల్​లో బ్యాటింగ్​తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు! ఐపీఎల్ ప్రాక్టీసులో భాగంగా సిక్సులు కొడుతూ కనిపించడమే ఇందుకు కారణం. దీంతో అభిమానులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను చెన్నై జట్టు ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

గతేడాది ఫ్లేఆఫ్స్​కు చేరడంలో విఫలమైన చెన్నై జట్టు.. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతోది. గత సీజన్​కు దూరమైన రైనా.. ఈసారి ఆడనుండటం సీఎస్కేకు కలిసొచ్చే అంశం. అలానే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్, రాబిన్ ఉతప్ప లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసిందీ జట్టు. ఏప్రిల్ 10న తన తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో చెన్నై తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.