ETV Bharat / sports

'సచిన్​ను ఎవరు ఔట్​ చేయమన్నారు.. వాళ్లు నిన్ను చంపేస్తారు: గంగూలీ'

author img

By

Published : Apr 8, 2022, 5:42 PM IST

Shoaib Akhtar
Sachin Tendulkar

Shoaib Akhtar: క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్​ వికెట్ పడగొట్టడం ఎలాంటి బౌలర్​కైనా పెద్ద ఘనత. కానీ, సచిన్ వికెట్ తీయడమే తాను చేసిన అతి పెద్ద తప్పని చెప్పాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఎందుకంటే..

Shoaib Akhtar: 2008 టీ20 లీగ్‌ ఆరంభ సీజన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ముంబయిలో ఔట్‌ చేయడం తాను చేసిన పెద్ద తప్పు అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల తాను తీవ్ర మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన అక్తర్‌.. నాటి లీగ్‌లో కోల్‌కతా బౌలర్‌గా వాంఖడేలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్‌ చేశానన్నాడు.

"ఆ రోజు వాంఖడే మొత్తం అభిమానులతో నిండిపోయి కళకళలాడుతోంది. అయితే, నేను తొలి ఓవర్‌లోనే సచిన్‌ను ఔట్‌ చేయడం వల్ల వారందరికీ కోపం వచ్చింది. ఆరోజు నేను చేసిన పెద్ద తప్పు అదే. తర్వాత మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఫైన్‌లెగ్‌లో నేను ఫీల్డింగ్‌ చేస్తుండగా ప్రేక్షకుల నుంచి పరుష పదాలు వినిపించాయి. అప్పుడు గంగూలీ నా వద్దకు వచ్చి.. 'మిడ్‌ వికెట్‌కు రా.. ఎవరు నిన్ను సచిన్‌ను ఔట్‌ చేయమన్నారు? అది కూడా ముంబయిలో. వాళ్లు నిన్ను చంపేస్తారు' అని అన్నాడు" అని అక్తర్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 15.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. షాన్‌ పొలాక్‌ 3, డ్వేన్‌ బ్రావో 2, రోహన్‌ 2, డొమినిక్‌ 2 వికెట్లతో చెలరేగడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (15) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన ముంబయికి అక్తర్‌ తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన ఐదో బంతికే సచిన్‌ (0) డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. అయితే, మరో ఓపెనర్‌ సనత్‌ జయసూర్య (48 నాటౌట్‌; 17 బంతుల్లో 6x4, 3x6) రెచ్చిపోయి ఆడాడు. రాబిన్‌ ఉతప్ప (9; 8 బంతుల్లో 2x4)తో కలిసి ధాటిగా ఆడి 5.3 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు.

ఇదీ చూడండి: 'ఆ రూల్స్​ ఉంటే సచిన్​ లక్షకుపైగా రన్స్​ చేసేవాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.