గుజరాత్​పై ఆర్సీబీ ఘన విజయం... సన్​రైజర్స్, పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు

author img

By

Published : May 19, 2022, 11:14 PM IST

RCB VS GJ

IPL 2022: గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్​ రేసులో సజీవంగా ఉంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారయ్యే అంశం.. దిల్లీ-ముంబయి మ్యాచ్ ఫలితంపై ఆధారపడనుంది. అయితే, ఆర్సీబీ తాజా విజయంతో సన్​రైజర్స్, పంజాబ్ జట్లు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.

ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచ్​లో ఆర్సీబీ రాణించింది. గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫాంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​లో సాధికార బ్యాటింగ్​తో అదరగొట్టాడు. అలవోకగా ఫోర్లు, సిక్సులు బాది మునుపటి కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. అయితే, ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైనట్లేం కాదు. శనివారం ముంబయితో జరిగే మ్యాచ్​లో దిల్లీ విజయం సాధిస్తే.. ఆర్సీబీ బదులు దిల్లీనే ప్లేఆఫ్స్​కు వెళ్తుంది. అయితే, ఈ విజయంతో సన్​రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. సాంకేతికంగా కూడా ఈ జట్లకు ప్లేఆఫ్స్​కు వెళ్లే అవకాశం లేదు.

అంతకుముందు, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (62*), డేవిడ్ మిల్లర్‌ (34), వృద్ధిమాన్‌ సాహా (31), రషీద్‌ ఖాన్‌ (19*), మ్యాథ్యూ వేడ్ (16) ధాటిగా ఆడటంతో బెంగళూరుకు లఖ్‌నవూ ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 169 పరుగులను లక్ష్యంగా ఉంచింది. శుభ్‌మన్‌ గిల్‌ (1), రాహుల్ తెవాతియా (2) విఫలమ్యారు. బెంగళూరు బౌలర్లలో జోష్‌ హేజిల్‌వుడ్ 2.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీశారు.

RCB VS GJ
ఆర్సీబీ విజయం..

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన తెలుగు తేజం నిఖత్​ జరీన్​.. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి పంచ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.