ETV Bharat / sports

'అర్జున్​ ఎదగడానికి ముంబయి జట్టే సరైనది!'

author img

By

Published : Feb 19, 2021, 10:04 AM IST

Updated : Feb 19, 2021, 10:27 AM IST

ఐపీఎల్​లో అర్జున్​ తెందూల్కర్​ నిలదొక్కుకునేందుకు ముంబయి ఇండియన్స్​ జట్టు సహకరిస్తుందని ఆ టీమ్​ డైరెక్టర్​ జహీర్​ఖాన్​ అభిప్రాయపడ్డాడు. అర్జున్​ కష్టపడే తత్వం కలవాడని.. నెట్స్​లో మెళకువలు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతాడని తెలిపాడు.

Mumbai Indians environment will help Arjun Tendulkar, says Zaheer Khan
అర్జున్ తెందూల్కర్​

యువ ఆల్​రౌండర్​ అర్జున్ తెందూల్కర్​ రాణించడానికి ముంబయి ఇండియన్స్​ టీమ్​ వాతావరణం సహకరిస్తుందని ఆ జట్టు డైరెక్టర్ జహీర్​ ఖాన్​ వెల్లడించాడు. కానీ, ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ప్రస్తుత ఐపీఎల్​లో తనకు తానుగా శ్రమించాలని తెలిపాడు.

"అర్జున్​కు కొన్ని మెళకువలు నేర్పేందుకు నెట్స్​లో అతడితో ఎక్కువ సమయాన్ని కేటాయించాను. అతడిది కష్టపడే వ్యక్తిత్వం. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. నేర్చుకోవడానికి అతడు ఎంతో ఆసక్తి చూపుతాడు. సచిన్​ తెందూల్కర్​ కుమారుడు అవ్వడం వల్ల అతడికి మరికొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు రాణించడానికి ముంబయి ఇండియన్స్​ జట్టు వాతావరణం సహకరిస్తుంది. ఓ మంచి క్రికెటర్​గా ఎదిగేందుకు అది తోడ్పడుతుంది".

- జహీర్​ ఖాన్​, ముంబయి ఇండియన్స్​​ డైరెక్టర్

గురువారం జరిగిన ఐపీఎల్​ వేలంలో అర్జున్​ తెందూల్కర్​ను ముంబయి ఇండియన్స్​ జట్టు రూ.20 లక్షల కనీసధరకు సొంతం చేసుకుంది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు నెట్​ బౌలర్​గా అర్జున్​ తెందూల్కర్​ పనిచేశాడు.

దేశవాళీ క్రికెట్​లో ముంబయి తరఫున అండర్​-19తో పాటు ఇతర విభాగాల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది జరిగిన సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ ద్వారా సీనియర్ల క్రికెట్​లోకి అర్జున్ అడుగుపెట్టాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్​లో సచిన్​ తనయుడు- ముంబయి తరఫున బరిలోకి

Last Updated : Feb 19, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.