ETV Bharat / sports

ధోనీ సర్జరీ పూర్తి.. ఇప్పుడెలా ఉందంటే?

author img

By

Published : Jun 1, 2023, 7:45 PM IST

Updated : Jun 1, 2023, 8:51 PM IST

MS Dhoni knee surgery : ఈ ఐపీఎల్​ సీజన్​లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన సీఎస్కే కెప్టెన్​ ధోనీకి విజయవంతంగా సర్జరీ పూర్తైంది. ఆ వివరాలు..

MS Dhoni successfully undergoes knee surgery in Mumbai
ధోనీ సర్జరీ పూర్తి.. ఇప్పుడెలా ఉందంటే?

MS Dhoni knee surgery : ఈ ఐపీఎల్‌ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్‌ ధోని మోకాలి గాయంతో ఎంత ఇబ్బంది పడ్డాడో క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. వికెట్ల మ‌ధ్య ప‌రుగులు తీసేందుకు ఇబ్బంది ప‌డ్డాడు. కానీ అలా ఇబ్బంది పడుతూనే.. ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్​కు దిగి భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. తమ జట్టు సీఎస్కేకు ఐదో ట్రోఫీని అందించి.. ముంబయి టైటిళ్ల రికార్డును సమం చేశాడు. అనంతరం ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స కోసం జాయిన్​ అయ్యాడు. అతడికి సర్జరీ అవసరమని వైద్యులు అన్నారు.

అయితే ఇప్పుడా మోకాలి సర్జరీ విజయంవంతగా పూర్తైంది. ఈ విషయాన్ని బీసీసీఐ మెడికల్​ ప్యానెల్​ మెంబర్​ ఆర్థోపెడిక్​ సర్జన్ డాక్టర్​ దిన్షా పర్దివాలా తెలిపారు. "అవును మహీ సర్జరీ.. కోకిలాబెన్​ హాస్పిటల్​లో విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్​ అవుతాడు. రిహాబిలిటేషన్​ ప్రారంభం ముందు అతడికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. వచ్చే ఐపీఎల్​లో ఆడేందుకు, మరింత ఫిట్​గా తయారేందుకు కావాల్సినంత సమయం ఉంది" అని పర్దివాలా చెప్పారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈయనే.. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్​ పంత్‌కు కూడా చికిత్స అందించారు.

అలాగా ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ కూడా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మ‌రో రెండు రోజులు మ‌హేంద్రుడు హాస్పిటల్​లోనే ఉంటాడని అన్నారు. "శస్త్రచికిత్స తర్వాత మహీతో మాట్లాడాను. సర్జరీ గురించి నేను వివరించలేను కానీ.. అది కీ హోల్ సర్జరీ అని మాత్రమే చెప్ప‌గ‌ల‌ను. అతడు బాగానే ఉన్నాడు" అని విశ్వానాథ‌న్ చెప్పుకొచ్చారు.

రిటైర్మెంట్​పై ధోనీ ఏమన్నాడంటే..

Dhoni IPL Retirement : వయసు కూడా 42 ఏళ్లకు చేరువ అవ్వడం వల్ల ఈ సీజన్‌తోనే ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేస్తాడేమో అన్న చర్చ కూడా సాగింది. హోం గ్రౌండ్​, బయట మైదానాల్లోనూ అతడి కోసమే క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే అతడు.. సీజన్​ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. కష్టమైనప్పటికీ అభిమానుల కోసం ఇంకో సీజన్‌ ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పి తన ఫ్యాన్స్​కు ఆనందాన్ని కలిగించాడు.

ఇదీ చూడండి :

IPL 2023 Awards : చెన్నై పాంచ్​ పటాకా.. ఈ సీజన్​ అవార్డులు, రివార్డులు ఇవే!

IPL 2023 CSK : రెమ్యూనరేషన్​ తక్కువ.. పెర్ఫామెన్స్‌ ఎక్కువ! సీఎస్కే విజయంలో వీరే కీలకం!

Last Updated : Jun 1, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.