ETV Bharat / sports

ధోనీ రికార్డును సమం చేయనున్న శుభ్​మన్​ గిల్.. ఏంటంటే?

author img

By

Published : May 27, 2023, 4:31 PM IST

Ms dhoni Shubman Gill
ధోనీ రికార్డు అందుకోనున్నశుభ్​మన్​ గిల్​

IPL 2023 Gill Reach Dhoni Record : ఐపీఎల్ 16వ సీజన్ క్వాలిఫయర్-2లో ముంబయిపై అదిరిపోయే విజయం సాధించిన గుజరాత్.. ఆదివారం అహ్మదాబాద్​లో జరగబోయే ఐపీఎల్‌-2023 ఫైనల్​ ఆడనుంది. ఈ మ్యాచ్​ ద్వారా గిల్ ఓ రికార్డు సొంతం చేసుకోనున్నాడు. ఆ రికార్డు ఏంటంటే..

IPL 2023 Gill Dhoni Record : గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ ఐపీఎల్‌ చరిత్రలో మరో అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఐపీఎల్‌ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ ధోనీకు మాత్రమే సాధ్యపడిన ఓ రికార్డును గిల్ ఈ ఫైనల్​ మ్యాచ్​తో సమం చేయనున్నాడు. ​ఇది వరకు ఐపీఎల్​లో మహీ తప్ప ఏ ఇతర ఆటగాడు వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్​లు ఆడలేదు. ధోనీ మాత్రమే మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఐపీఎల్ ఫైనల్స్​ ఆడాడు. చెన్నై తరఫున ధోనీ ఏకంగా నాలుగు సీజన్లలో (2010, 2011 , 2012, 2013) ఆడాడు. ఇందులో రెండు సార్లు చెన్నై టైటిల్ నెగ్గగా.. రెండు సార్లు రన్నరప్​తో సరిపెట్టుకుంది.

IPL 2023 Gill Record :ఈ క్రమంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగే ఫైనల్లో గుజరాత్ తరఫున బరిలోకి దిగనున్న శుభ్‌మన్‌ గిల్‌ కూడా వరుసగా మూడు ఐపీఎల్​ ఫైనల్ మ్యాచ్​లు ఆడిన ఆటగాడిగా ధోనీ సరసన చేరుతాడు. గతంలో 2021లో కేకేఆర్‌ (రన్నరప్‌) తరఫున, 2022లో గుజరాత్‌ (విన్నర్‌) తరఫున ఆడిన గిల్ ఆదివారం మరోసారి ఫైనల్ మ్యాచ్​ బరిలో దిగనున్నాడు. అంతేకాకుండా గిల్ గతంలో ఆడిన ఫైనల్స్​లో మంచి ప్రదర్శనే చేశాడు. 2021లో కోల్​కతా తరఫున 51 పరుగులు, 2022లో గుజరాత్ తరఫున 45 పరుగులతో రాణించాడు.

IPL 2023 Gill Stats : ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో భీకరమైన ఫామ్​లో ఉన్న శుభ్​మన్​.. మూడు సెంచరీలు, 4 హాఫ్​ సెంచరీలతో సహా 60.79 సగటున 851 పరుగులు చేశాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 973 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. రాజస్థాన్ బ్యాటర్ జాస్ బట్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్​లో ఒకే సీజన్​లో ఎక్కువ సెంచరీల రికార్డు కూడా వీరిద్దరి పేరిటే ఉంది. 2016లో విరాట్ కోహ్లీ, 2022లో బట్లర్ నాలుగేసి సెంచరీలు బాదారు. ప్రస్తుతం గిల్ మూడు శతకాలతో ఈ సీజన్​లో టాప్​లో ఉన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్న కరణ్​ శర్మ కూడా వరుసగా మూడు ఫైనల్స్‌లో ఉన్నాడు. 2016లో సన్​రైజర్స్​​, 2017 ముంబయి ఇండియన్స్​, 2018 చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఈ మూడింట్లోనూ అతడు తుది జట్టులో స్థానం సంపాదించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.