ETV Bharat / sports

దూబె సిక్సర్‌ దెబ్బకు కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న గావస్కర్​

author img

By

Published : May 15, 2023, 8:10 AM IST

Updated : May 15, 2023, 9:01 AM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా కేకేఆర్​-సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్​లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. దిగ్గజ క్రికెట్​ సునీల్ గావస్కర్​.. ధోనీని ఆటోగ్రాఫ్​ అడగటం, దూబె బాదిన ఓ భారీ సిక్సర్​.. కేకేఆర్​ చీర్​గర్స్​పైకి దూసుకెళ్లడం, అభిమానుల గోలకు ధోనీ కాస్త ఇబ్బంది పడటం ఇలా ఎన్నో జరిగాయి. ఆ సంగతులు, వాటికి సంబంధించిన వీడియోలు మీకోసం..

దూబె సిక్సర్‌ దెబ్బ.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ.. ఇబ్బంది పడ్డ ధోనీ
దూబె సిక్సర్‌ దెబ్బ.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ.. ఇబ్బంది పడ్డ ధోనీ

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో ఓ అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమ్​ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌.. ధోనీని ఆటోగ్రాఫ్‌ అడగడం ఆసక్తిగా మారింది. ఈ అరుదైన దృశ్యం మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగింది. సునీల్‌ గావస్కర్‌ స్వయంగా మహీ వద్దకు వెళ్లి మరీ ఆటోగ్రాఫ్‌ అడిగాడు. ఓ దిగ్గజ క్రికెటర్‌ ఆటోగ్రాఫ్‌ అడిగితే మహీ మాత్రం కాదంటాడా. గావస్కర్‌ షర్ట్‌ ముందు భాగంపై తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ధోనీని.. సునీల్‌ గావస్కర్‌ హార్ట్ ఫుల్​గా హత్తుకున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతకముందు కేకేఆర్‌ ప్లేయర్​ రింకూ సింగ్‌ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచి ధోనీ ఆట చూస్తూ పెరిగిన అతడు.. తన అభిమాన ప్లేయర్​కు ప్రత్యర్థిగా ఆడడమే కాకుండా 50 స్కోరుతో కేకేఆర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. మహీతో కలిసి కాసేపు ముచ్చటించాడు రింకూ. విలువైన సలహాలను తీసుకున్నాడు. అనంతరం తన జెర్సీపై ఆటోగ్రాఫ్‌ అడిగి పెట్టించుకున్నాడు.

జడ్డూ ఔట్​.. సీన్​ రివర్స్​.. సాధారణంగా ఐపీఎల్​లో చెన్నై ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఫ్యాన్స్​ భారీ సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా ఎంఎస్‌ ధోనీ బ్యాటింగ్ చూడటం కోసమే వస్తుంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహీ బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క బంతి ఆడినా.. ఆనందంతో మురిసిపోతారు. అయితే అతడి బ్యాటింగ్‌ కోసం ఎంతలా ఎదురుచూస్తారన్నదానికి.. తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన జడేజా.. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే చెన్నై ఇన్నింగ్స్‌కు కేవలం రెండు బాల్స్​ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే సాధారణంగా ఏ మ్యాచులోనైనా.. మద్దతిస్తున్న జట్టుకు చెందిన బ్యాటర్‌ ఔటైతే బాధపడడం చూస్తాం. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. జడ్డూ ఔట్ అవ్వగానే స్టేడియం హోరెత్తిపోయింది. ఎందుకంటే జడ్డూ ఔట్‌ అయితేనే ధోనీ ఎంట్రీ ఇస్తాడు. అంతే ఇక మహీ ఎంట్రీతో స్టేడియం మొత్తం అతడి నామసర్మణతో దద్దరిల్లిపోయింది. అయితే మహీ రెండు పరుగులు చేశాడు.

ఇబ్బంది పడ్డ మహీ.. ధోనీ మ్యాచ్‌ ఆడుతున్నా, అతడు స్డేడియంలో కనిపించినా.. మహీ నామసర్మణతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. అయితే అదే గోల.. మహీ ఏదైనా మాట్లాడినప్పుడు వినిపిస్తే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే అతడు ఏం మాట్లాడుతాడా అని చాలా మందికి ఆసక్తి కూడా ఉంటుంది. అయితే ఈ మ్యాచ్​లో ఫ్యాన్స్ గోల వల్ల.. ధోనీ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏమైందంటే.. కేకేఆర్​పై మ్యాచ్‌ ఓడినా కూడా చెన్నై అభిమానుల్లో జోష్‌ ఏమాత్రం తగ్గలేదు. మ్యాచ్‌ అనంతరం ఓటమికి గల కారణాలు చెప్పేందుకు ధోనీ ప్రయత్నిస్తుంటే.. చెపాక్‌ స్టేడియమంతా మహీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీంతో కామెంటేటర్‌ అడిగిన ప్రశ్న ధోనీకి అస్సలు అర్థం కాలేదు. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ప్రశ్న అడిగినా.. ధోనీకి అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌ మాకు కలిసిరాలేదు అనుకుంటా. బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాం. పవర్‌ప్లేలో సరిగ్గా రన్స్​ చేయలేకపోయాము. శివమ్‌ దూబే బ్యాటింగ్‌ చాలా బాగుంది. అతడి నుంచి మేం ఏం ఆశిస్తున్నామో అది బాగా చేస్తున్నాడు. ప్లేఆఫ్స్​కు తప్పకుండా వెళ్తాం" అని మహీ అన్నాడు.

దూబె సిక్సర్‌ దెబ్బ.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ.. ఇక ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. చెన్నై ఇన్నింగ్స్‌ సమయంలో శివమ్‌ దూబె కొట్టిన సిక్సర్‌.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ను తాకింది. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్​లో సుయాశ్‌ శర్మ వేసిన ఐదో బంతిని దూబె ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. అక్కడే కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ కూర్చొని ఉండగా.. వారి మీదకు ఆ బంతి నేరుగా దూసుకెళ్లింది. దీంతో ఆ చీర్​గర్ల్స్​ షాక్ అయిపోయారు. కాస్తలో ఉంటే దెబ్బ గట్టిగానే వారికి తగిలేది. ఆ తర్వాత నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి..

ఇదీ చూడండి: CSK vs KKR : రింకూ-నితీశ్ హాఫ్​ సెంచరీ.. కోల్‌కతా ఇంకా రేసులోనే..

Last Updated :May 15, 2023, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.