ETV Bharat / sports

IPL 2023 RR vs GT: బట్లర్ మనసు దోచిన చిన్నది.. ఏడేళ్ల తర్వాత రెండోసారి ఇలా!

author img

By

Published : Apr 17, 2023, 12:34 PM IST

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 2023 సీజన్‌లో గుజరాత్​ హోం గ్రౌండ్​లో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ ఓపెనర్​ బట్లర్​కు ఓ యువతి ఫిదా అయిపోయింది. వారిద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు చూశారా?

Jos buttler
IPL 2023 RR vs GT: బట్లర్ మనసు దోచిన చిన్నది.. ఏడేళ్ల తర్వాత రెండోసారి ఇలా..

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్​ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌.. గుజరాత్‌ అహ్మాదాబాద్​ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. హోం గ్రౌండ్​లో తమ టీమ్​ మ్యాచ్​ ఆడుతుందంటే.. అక్కడి వచ్చే ప్రేక్షకుల మద్దతు, ప్రోత్సాహం.. సదరు టీమ్​కే ఉంటుంది. అయితే ఇక్కడ ఓ గుజరాత్‌ చిన్నది మాత్రం.. రాజస్థాన్​ రాయల్స్​కు మద్దతుగా నిలిచింది! ఆ జట్టు ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ మనసును దోచేసింది!

అసలేం జరిగిందంటే.. గుజరాత్‌-రాజస్థాన్​ రాయల్స్‌ మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ జరిగింది. ఈ ప్రాక్టీస్‌ మ్యాచులో ఇరు జట్లు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే బట్లర్‌ తన ప్రాక్టీస్​ను పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఓ యువతి బట్లర్‌ వద్దకు వచ్చి తన అభిమానాన్ని చాటుకుంది. అతడిని చూసి ఎంతో సంబరపడిపోయింది. అతడంతే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. 'నేను మీకు పెద్ద ఫ్యాన్​. మీ ఆటంటే నాకు చాలా చాలా ఇష్టం.. ఐ లవ్‌ యూ' అంటూ చెప్పింది. ఆమె మాటలకు ముగ్దుడైన బట్లర్‌.. ఎంతో సరదాగా ఆ యువతితో ముచ్చటించాడు.

'ఐపీఎల్​ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నావా' అని బట్లర్​ అడగగా.. "సూపర్​గా ఆస్వాదిస్తూన్నా. బాగా ఎంజాయ్ చేస్తున్నా. నాది గుజరాత్‌ అయినప్పటికీ మీకు విరాభిమానిని. మ్యాచ్‌లో మీకోసమే రాజస్థాన్​ రాయల్స్‌కు మద్దతు ఇస్తున్నా" అని చెప్పుకొచ్చింది. దీనికి బట్లర్‌ సమాధానమిస్తూ.. "మ్యాచ్‌లో నున్వొక్కదానివే పింక్‌ డ్రెస్‌ వేసుకుంటావు" నవ్వూతూ మాట్లాడాడు. ఆ తర్వాత సదరు అమ్మాయి.. బట్లర్​తో సెల్ఫీ దిగి ఆటోగ్రాప్ తీసుకుంది. ఈ వీడియోను ఐపీఎల్ అధికారిక సోషల్​మీడియాలో పోస్ట్​ చేయగా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు బట్లర్​ మనసు దోచిన గుజరాత్ చిన్నది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏడేళ్ల తర్వాత రెండో సారి.. ఇక ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్​లో జాస్‌ బట్లర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అతడికి ఇది రెండోది. తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్​లో 2016లో రైజింగ్​ పుణెతో జరిగిన పోరులో తొలిసారి డకౌట్​గా అయిన అతడు... మళ్లీ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత రెండో సారి డకౌట్‌ అయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని దక్కించుకుంది. ​సంజు శాంసన్‌ (60; 32 బంతుల్లో 3×4, 6×6), హెట్‌మయర్‌ (56 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 5×6) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో రాయల్స్​.. 3 వికెట్ల తేడాతో హార్దిక్​ సేనపై గెలిచింది.

ఇదీ చూడండి: IPL 2023 : ఎవరీ తెలుగందం.. చూశారంటే.. ఐపీఎల్​కు బ్రేక్ ఇవ్వరంతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.