ETV Bharat / sports

IPL 2023: దినేశ్ కార్తీక్-సిరాజ్.. ఒకరేమో ప్రపంచ రికార్డు.. మరొకరేమో..

author img

By

Published : Apr 3, 2023, 10:14 AM IST

Dinesh Karthik Mohammed Siraj
IPL 2023: సిరాజ్​ చెత్త రికార్డ్​.. దినేశ్ కార్తిక్​ ప్రపంచ రికార్డ్​

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ప్లేయర్స్​ మహ్మద్ సిరాజ్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకోగా.. దినేశ్ కార్తీక్​ వరల్డ్ రికార్డును అందుకున్నాడు. ఆ వివరాలు..

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో భాగంగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. వీటిలో ఓ చెత్త రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. ముంబయి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ తరఫున 19వ ఓవర్ వేసిన బౌలర్​ సిరాజ్.. ఏకంగా 5 వైడ్ బాల్స్ సంధించాడు. దీంతో ఈ ఐపీఎల్ హిస్టరీలో ఆ ఓవర్ ఓ చెత్త రికార్డుగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్​లో తన తొలి మ్యాచ్‌లోనే సిరాజ్ ఇలా ఆడటం అందిరినీ షాక్​కు గురి చేసింది. 19వ ఓవర్​లో తొలి రెండు బంతుల్లో 0,1 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు వైడ్ బాల్స్ వేశాడు. మూడో బంతికి 2, నాలుగో బంతికి 4 పరుగులు వచ్చాయి. అనంతరం మరో వైడ్ వేశాడు. ఐదో బంతికి 4, ఆరో బంతికి 0 పరుగులు వచ్చాయి. ఇలా సిరాజ్ తన ఓవర్​ను(0, 1, Wd, Wd, Wd, Wd, 2, 4, Wd, 4, 0) ముగించాడు. మొత్తంగా అతడి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. అయితే ముంబయి పవర్‌ప్లేలో మాత్రం సిరాజ్ మంచి బౌలింగ్ వేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బాగానే కట్టడి చేశాడు. పవర్ ప్లేలోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను సిరాజ్ సంధించగా.. వాటిలో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.

దినేశ్ కార్తీక్ ప్రపంచ రికార్డు.. ఇక ఈ మ్యాచ్​లో ఆర్సీబీ వికెట్ కీపర్‌ దినేశ్​ కార్తీక్ ఓ ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ సీజన్ తన ఆరంభ మ్యాచ్‌లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ(1) దినేశ్ కార్తిక్​కు క్యాచ్ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఈ క్యాచ్​తో టీ20 క్రికెట్‌లో 200 క్యాచ్‌లు పట్టుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇకపోతే ఈ ఘనత సాధించిన భారత రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. ఇతడికి కన్నా ముందు.. టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్​ క్వింటన్ డి కాక్.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతడు ఇప్పటివరకు మొత్తం 207 క్యాచ్‌లను అందుకున్నాడు. రెండో స్థానంలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, ప్రస్తుత సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఇప్పుడు దినేశ్ కార్తీక్​.. 200 క్యాచ్‌లను పూర్తి చేసిన నేపథ్యంలో ప్రపంచ క్రికెట్​లో మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఇకపోతే మ్యాచ్ అనంతరం విజయంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. "బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభం దక్కింది. పవర్ ప్లేలో మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థులను బాగా కంట్రోల్ చేశాడు. మా బౌలర్లు ప్రణాళికలను బాగా అమలు చేశారు. చివరి రెండు మూడు ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు ఎలా ఛేజ్ చేయాలో మాకు తెలుసు. స్పిన్నర్లు ఇక్కడ కొంత విజయాన్ని సాధించారు. కోహ్లీతో కలిసి ఆడటం ఎంతో ప్రత్యేకం. అతడి శక్తి అమోఘం" అని అన్నాడు.

"తొలి ఆరు ఓవర్లలో మా ఆరంభం గొప్పగా లేదు. తిలక్​తో పాటు కొందరు బ్యాటర్లు బాగా కృషి చేశారు. అయితే బౌలింగ్​.. ప్రణాళిక ప్రకారం జరగలేదు. ‘ఈ పిచ్ బ్యాటర్లకు బాగా ఉపయోగపడింది. తిలక్ వర్మ సానుకూల దృక్పథం ఉన్న ప్లేయర్. అతడిలో ప్రతిభ ఉంది. అతడు బాదిన కొన్ని షాట్లు సూరర్​. ‘గత 6-8 నెలలుగా జస్ప్రిత్ బుమ్రా లేకుండానే నేను ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. గాయాలనేది మా చేతుల్లో ఉండవు. మేం దాని గురించి ఆలోచించట్లేదు. ఇతర ప్లేయర్స్​ కూడా టాలెంటే. వారిని ప్రోత్సహించాలి. ఇది తొలి మ్యాచ్​ మాత్రమే. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. వాటి కోసం ఎదురుచూస్తున్నాం." రోహిత్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: IPL 2023: RCB-Mumbai మ్యాచ్​కు వచ్చిన స్పెషల్ గెస్ట్​లు వీరే.. ఫొటోస్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.