ETV Bharat / sports

ధోనీ 200వ IPL మ్యాచ్.. బట్లర్​ హాఫ్​ సెంచరీ.. చెన్నై టార్గెట్​ ఫిక్స్

author img

By

Published : Apr 12, 2023, 9:14 PM IST

Updated : Apr 12, 2023, 10:09 PM IST

ipl 2023 chennai super kings rajasthan royals match
ipl 2023 chennai super kings rajasthan royals match

ఐపీఎల్​ 16వ సీజన్​లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ ఇన్నింగ్స్​ పూర్తి చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై టార్గెట్​ ఎంతంటే?

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్​ బ్యాటర్లలో జోస్​ బట్లర్​ అదరగొట్టాడు. పడిక్కల్​, అశ్విన్​ రాణించగా.. కెప్టెన్​ సంజూ నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో ఆకాశ్​ సింగ్​, తుషార్​ దేశ్​పాండే, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. మెయిన్​ అలీ ఒక వికెట్​ తీశాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ ఓపెనర్లు యశస్వి జైస్వాల్​, జోస్​ బట్లర్​ శుభారంభం చేశారు. అయితే ఆదిలోనే రాజస్థాన్‌ మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్‌ పడిక్కల్ (38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్​లో కెప్టెన్​ సంజూ శాంసన్​ నిరాపరిచాడు. జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్‌ వేసిన 15 ఓవర్‌లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్​రౌండర్​ అశ్విన్‌ (30) ఇదే ఓవర్‌లో చివరి బంతికి మగాలాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్​గా వచ్చి దుమ్మురేపిన బట్లర్​ ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్‌ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్​ జురెల్​.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్​ సింగ్​ బౌలింగ్​లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్​ హోల్డర్, జంపా డకౌట్​గా పెవిలియన్​ చేరారు. హెట్​ మెయర్​(30*) ​నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్​ 175 పరుగులు సాధించింది.

బట్లర్​ హాఫ్​ సెంచరీ..
ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు ఓపెనర్​ జోస్‌ బట్లర్ అర్ధ శతకం బాదేశాడు. తీక్షణ వేసిన 16 ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. బట్లర్​ లీగ్​ చరిత్రలో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

  • IPL 2023లో పవర్‌ ప్లేలో రాజస్థాన్‌ స్కోర్లు
  • 85/1 vs సన్​రైజర్స్​ హైదరాబాద్
  • 57/3 vs పంజాబ్​ కింగ్స్​
  • 68/0 vs దిల్లీ క్యాపిటల్స్​
  • 57/1 vs చెన్నై సూపర్​ కింగ్స్​

ఆకాశ్‌ సింగ్‌ అరంగేట్రం
గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముఖేశ్‌ చౌదరి గాయం కారణంగా ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌ సింగ్‌ను ఈ మ్యాచ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ 20 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ ఇంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు. ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షలకు సీఎస్కే తీసుకుంది. ఈ మ్యాచ్​లో ఆకాశ్​ సింగ్ రెండు​ వికెట్లు పడగొట్టాడు.

Last Updated :Apr 12, 2023, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.