ETV Bharat / sports

కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్​ చరిత్రలోనే తొలి ప్లేయర్​గా..

author img

By

Published : May 20, 2022, 9:31 PM IST

Virat Kohli
IPL 2022

Virat Kohli: ఐపీఎల్​లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ. లీగ్​ చరిత్రలోనే వరుసగా 13 సీజన్లలో 300 ప్లస్​ స్కోర్లు సాధించిన తొలి ప్లేయర్​గా ఘనత సొంతం చేసుకున్నాడు.

Virat Kohli: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ చరిత్రలో వరుసగా 13 సీజన్లలో (2010 నుంచి 2022 వరకు) 300ల పైచిలుకు పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు. గురువారం గుజరాత్​ టైటాన్స్​తో మ్యాచ్​ సందర్భంగా ఈ ఘనత దక్కించుకున్నాడు విరాట్.

బెంగళూరు తరఫున 7000: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్‌ (73; 54 బంతుల్లో 8x4, 2x6) విజృంభించాడు. కవర్‌ డ్రైవ్‌లు, ఫ్లిక్‌ షాట్లలాంటి చూడచక్కని బ్యాటింగ్‌తో మళ్లీ తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేశాడు. దీంతో బెంగళూరు జట్టే కాకుండా అతడి అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ మ్యాచ్‌తో విరాట్‌ మరో అరుదైన రికార్డూ నెలకొల్పాడు కోహ్లీ. బెంగళూరు ఫ్రాంఛైజీ తరఫున 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

కాగా, విరాట్‌ ఇప్పటివరకు ఈ లీగ్‌లో మొత్తం 221 మ్యాచ్‌ల్లో 6,592 పరుగులు చేయగా.. మిగతావి ఛాంపియన్స్‌ లీగ్‌ (ఇప్పుడు లేదు)లో సాధించాడు. దీంతో ఫ్రాంఛైజీ లీగ్‌ క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున ఇన్ని పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.

ఇదీ చూడండి: ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​గా కోహ్లీ.. మూడో బౌలర్​గా రబాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.