ETV Bharat / sports

పంజాబ్​ను నిలువరించి ముంబయి బోణీ కొట్టేనా?

author img

By

Published : Apr 13, 2022, 12:03 PM IST

IPL MI vs PBKS
రోహిత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​

IPL 2022 MI vs PBKS match preview: ఐపీఎల్​ మెగా టోర్నీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​తో ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. నాలుగు వరుస ఓటములతో పదో స్థానికి పడిపోయిన ముంబయి ఈ మ్యాచ్​లో గెలిచి బోణీ కొడుతుందా? పంజాబ్​ కింగ్స్​కు తలొగ్గుతుందా? అనేది తెలియాలంటే ఈ మ్యాచ్ జరిగేవరకు వేచి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిద్దాం..

IPL 2022 MI vs PBKS match preview: ఐపీఎల్​లో ఛాంపియన్లుగా పేరున్న చెన్నై, ముంబయి జట్లు 15వ సీజన్​లో నాలుగు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచాయి. అయితే.. ఎట్టకేలకు మంగళవారం జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీపై గెలిచి చెన్నై సూపర్​ కింగ్స్​ బోణీ కొట్టింది. మరి.. చెన్నై దారిలోనే ముంబయి ఇండియన్స్​ తొలి విజయాన్ని నమోదు చేస్తుందా? బుధవారం జరిగే మ్యాచ్​లో పంజాబ్​పై గెలిచి బోణీ కొట్టగలదా? అన్న ఆసక్తి ప్రస్తుతం క్రికెట్​ అభిమానుల్లో విపరీతంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు బలహీనతల గురించి తెలుసుకుందాం..

Mumbai indians strengthness and weekness: ఈ సీజన్​లో ఇప్పటి వరకు ఖాతా తెరవని ముంబయి తొలి విజయం కోసం ఆరాటపడుతోంది. ఓటముల ట్రెండ్​ను మార్చాలని పట్టుదలతో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిచిన ముంబయికి నాలుగు వరుస ఓటములు పీడకలగానే చెప్పుకోవచ్చు. అయితే.. ఈ లీగ్​ను నెమ్మదిగా ప్రారంభించి చివరకు కప్పు ఎగరేసుకుపోతుందనే పేరుంది. దానిని మళ్లీ రిపీట్​ చేస్తుందని ముంబయి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సీజన్లుగా ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబయి ఈ సీజన్​ను అత్యంత పేలవంగా ప్రారంభించింది. ముంబయి బ్యాటర్లు పెద్ద స్కోర్లు సాధించటంలో విఫలమవుతున్నారు.

గత మ్యాచ్​లో ఒక్క సూర్యకుమార్​ తప్ప ఎవ్వరూ రాణించలేకపోయారు. మరోవైపు.. బౌలింగ్​ విభాగం సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచుల్లో ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్​ రోహిత్​ శర్మ.. బ్యాట్​ ఝుళిపించి జట్టును విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నాడు. టాప్​ఆర్డర్​లో రోహిత్​ శర్మ కీలకం. అలాగే.. మరో ఓపెనర్​ ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​, తిలక్​ వర్మలు సైతం రాణిస్తేనే జట్టుకు పెద్ద స్కోర్​ వస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్​లను గెలిపించగల సత్తా ఉన్న ఆల్​రౌండర్​ కిరాన్​ పొలార్డ్​.. ఫామ్​లో లేకపోవటం జట్టును కలవరపెడుతోంది.

విజయమే లక్ష్యంగా పంజాబ్​: ఈ సీజన్​ను విజయంతో ప్రారంభించింది పంజాబ్​ కింగ్స్. అయితే.. తర్వాత జరిగిన మూడింటిలో రెండు ఓడిపోయింది. మొత్తంగా నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ముంబయి ఇండియన్స్​తో బుధవారం జరగనున్న మ్యాచ్​లో గెలిచి తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. కెప్టెన్​ మయాంక్​ అగర్వాల్​, ఓపెనర్​ శిఖర్​ ధావన్​, భానుక రాజపక్సలు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అది జట్టును ఆందోళన కలిగిస్తోంది. అయితే, బౌలర్లు కగిసో రాబాడా, రాహుల్​ చాహర్​, సందీప్​ శర్మ ఆకట్టుకుంటుండటం కలిసొచ్చే విషయం.

ముంబయి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ తెందుల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ ఇషాన్ కిషన్.

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, షారుక్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఒడియన్ స్మిత్, సందీప్ శర్మ, రిషి బావా, రాజ్ అంగద్ బావా ధావన్, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, రిటిక్ ఛటర్జీ, బల్తేజ్ ధండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్.

ఇదీ చూడండి: కెప్టెన్​గా తొలి విజయం.. ఆమెకే అంకితం: జడ్డూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.