ETV Bharat / sports

IPL 2021 News: 'రోహిత్​ నమ్మకం వల్లే ఇదంతా'

author img

By

Published : Oct 6, 2021, 3:40 PM IST

Updated : Oct 6, 2021, 6:49 PM IST

Ishan Kishan
ఇషాన్ కిషన్

మంగళవారం (IPL 2021) రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ అద్వితీయ విజయంలో కీలకపాత్ర పోషించాడు యువ బ్యాట్స్​మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan). అయితే గత మ్యాచుల్లో ఇతడు విఫలయ్యాడు. అయినా తనపై జట్టుతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకం ఉంచాడని తెలిపాడు ఇషాన్.

ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians Squad 2021) తుది జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌తో జరిపిన సంభాషణలు తనలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపాయని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) అన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని వివరించాడు. మంగళవారం (IPL 2021) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ( 50 నాటౌట్‌; 25 బంతుల్లో 5×4, 3×6) అదరగొట్టి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కిషన్‌ మాట్లాడాడు.

"తిరిగి ఓపెనింగ్‌ చేయడం, జట్టు కోసం పరుగులు చేయడం, భారీ తేడాతో విజయం సాధించడానికి సహాయపడటం ఆనందంగా ఉంది. నిజంగా ఇది మంచి అనుభూతి. మా జట్టు పుంజుకోవడానికి ఇది అవసరం. ఒడిదొడుకులు అనేవి ఏ క్రీడాకారుని జీవితంలోనైనా ఓ భాగం అని భావిస్తా. ప్రస్తుతం నేను కూడా గొప్ప స్థితిలో లేను. గత సీజన్లలో మాదిరిగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. మాకు మంచి సహాయక సిబ్బంది, కెప్టెన్‌ ఉన్నారు" అని ఇషాన్ కిషన్‌ అన్నాడు.

Ishan Kishan
హార్దిక్, విరాట్​లతో ఇషాన్

"విరాట్ భాయ్‌ (విరాట్‌ కోహ్లి), హార్దిక్ పాండ్యాతో సంభాషణలు జరిపా. (Virat Kohli News)ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. కీరన్‌ పొలార్డ్‌తో మాట్లాడినప్పుడు.. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. గత సీజన్లలో నేను బ్యాటింగ్‌ చేసిన వీడియోలను చూడమని చెప్పాడు. కొన్ని వీడియోలను చూశా. అవి నాలో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి" అని ఇషాన్‌ కిషన్‌ ముగించాడు.

ఇదీ చూడండి: అతడి విషయంలో రిస్క్​ తీసుకున్నా: రోహిత్​

Last Updated :Oct 6, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.