ETV Bharat / sports

IPL 2021: హ్యాట్రిక్​తో ముంబయికి చుక్కలు చూపించిన హర్షల్​

author img

By

Published : Sep 27, 2021, 7:51 AM IST

Harshal Patel becomes third RCB bowler to claim a hat-trick in IPL after Praveen Kumar and Samuel Badree
IPL 2021: హ్యాట్రిక్​తో ముంబయికి చుక్కలు చూపించిన హర్షల్​

ఐపీఎల్​లో(IPL 2021) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్​ 14వ సీజన్‌లో హ్యాట్రిక్(Harshal Patel Hat Trick) సాధించిన తొలి బౌలర్​గా నిలిచాడు. ముంబయి ఇండియన్స్‌పై(RCB Vs MI) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, రాహుల్ చాహర్‌లను వెంటవెంటనే ఔట్ చేసిన హర్షల్ పటేల్.. ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

ఐపీఎల్​(IPL 2021) రెండోదశలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టోర్నీలో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుపై(RCB Vs MI) 54 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. ఆర్సీబీ కెప్టెన్​​ కోహ్లీ హాఫ్​సెంచరీ సహా మ్యాక్స్​వెల్​(Maxwell IPL News) ఆల్​రౌండర్​ ప్రదర్శన ముంబయి ఓటమికి కారణమైంది. అయితే మ్యాచ్​కు టర్నింగ్​ పాయింట్​ అంటే హర్షల్​ పటేల్​ హ్యాట్రిక్​(Harshal Patel Hat Trick) వికెట్స్​ అనే చెప్పుకోవాలి. 17వ ఓవర్లో హర్షల్‌ వరుస బంతుల్లో హార్దిక్‌(3), పొలార్డ్‌(7), రాహుల్‌ చాహర్‌(0)ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించడం ద్వారా బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ముంబయి ఇండియన్స్​ 111 పరుగులకు ఆలౌటైంది.

సీజన్​లో తొలిబౌలర్​గా..

ఐపీఎల్​ 14వ సీజన్‌లో హ్యాట్రిక్(Harshal Patel Hat Trick) సాధించిన తొలి బౌలర్​గా హర్షల్​ పటేల్​ నిలిచాడు. హర్షల్​ పటేల్​కు ఐపీఎల్​లో తొలి హ్యాట్రిక్​ ఇదే కావడం విశేషం. అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు తరఫున హ్యాట్రిక్​(RCB Bowler Hat Trick) సాధించిన మూడో బౌలర్​గా హర్షల్​ పటేల్​ అవతరించాడు. ప్రవీణ్​ కుమార్​, సామ్యూల్​ బద్రీల తర్వాత హర్షల్​ నిలిచాడు. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో 3.1 ఓవర్ల బౌలింగ్​ వేసి 17 పరుగులతో 4 వికెట్లు పడగొట్టాడు.

ప్లేఆఫ్స్​కు చేరువలో..

ఐపీఎల్​ రెండోదశలో వరుసగా మూడో పరాజయాన్ని ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians News) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ సత్తా చాటడం వల్ల ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 54 పరుగుల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (56), కోహ్లీ (51) మెరవడం వల్ల మొదట బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. బౌలింగ్​లో హర్షల్‌ పటేల్‌ (4/17), మ్యాక్స్‌వెల్‌ (2/23), చాహల్‌ (3/11) విజృంభించడం వల్ల ఛేదనలో ముంబయి 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించాడు. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సాధించడం విశేషం. బెంగళూరు ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను(RCB Playoff Chances 2021) ఇంకా మెరుగుపర్చుకుంది.

ఇదీ చూడండి.. RCB Vs MI: బెంగళూరు విజయానికి టర్నింగ్​ పాయింట్​ అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.