ETV Bharat / sports

బైక్​పై ధోనీ రయ్​ రయ్​.. ప్రాక్టీసు మొదలు పెట్టిన 'మిస్టర్​ కూల్'

author img

By

Published : Feb 7, 2023, 10:14 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ఎమ్​ఎస్​ ధోనీ బైక్​పై సందడి చేశాడు. ప్రాక్టీసు కోసం ప్రతిరోజు అదే బైక్​పై స్టేడియానికి వస్తున్నాడని తెలుస్తోంది. కాగా, ధోనీ ఇలా బైక్​పై రావడాన్ని ఓ అభిమాని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

dhoni tvs apache bike
dhoni tvs apache bike

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ఎమ్ఎస్​ ధోనీకి బైక్​లంటే చాలా ఇష్టం. అతడి గ్యారెజీలో బైక్​ల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌ కూడా ఉంది. అందులో రకరకాల బైక్‌లు ఉంటాయి. తాజాగా ఈ క్రికెటర్​ టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310 బైక్​పై రాంచీ స్టేడియానికి వచ్చాడు. ఆ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న ధోనీ.. రోజు అదే బైక్​పై వస్తున్నట్లు సమాచారం. బైక్​పై వెళ్తున్న ధోనీని ఓ అభిమాని తన కెమెరాలో చిత్రీకరించాడు. దీన్ని సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్​ అవుతోంది.

టీమ్​ఇండియా కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్​ ధోనీ వేసిన ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం భారత క్రికెట్​ను ఆగ్రస్థానంలో నిలబెట్టాయి. అందుకే అతడికి క్రికెట్​ అభిమానులు నీరాజనం పడతారు. అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ఈ ప్లేయర్..​ ప్రస్తుతం ఐపీఎల్​ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే ఐపీఎల్​ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే ధోనీ ప్రాక్టీసు కోసం రోజు బైక్​పై రాంచీ స్టేడియానికి వచ్చి వెళ్తున్నాడు. కాగా, రాబోయే ఐపీఎల్​ ధోనీకి చివరిదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.