ETV Bharat / sports

GT Vs CSK: గుజరాత్​ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం

author img

By

Published : Mar 31, 2023, 11:00 PM IST

Updated : Apr 1, 2023, 6:38 AM IST

ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో​ గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై.. రుతురాజ్‌ గైక్వాడ్ (92) పరుగులు బాది త్రుటిలో సెంచరీ మిస్​ చేసుకున్నాడు. ఇక గుజరాత్​ తరఫున శుభ్​మన్​ గిల్​ మెరుపు షాట్లతో (63) అదరగొట్టాడు.

IPL 2023 Gujarat VS Chennai
IPL 2023 Gujarat VS Chennai

ఐపీఎల్​ 16వ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, గుజరాత్​ టైటాన్స్ తలపడగా.. 5 వికెట్ల తేడాతో గుజరాత్​ ఘన విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు గుజరాత్ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అదిరే ఆరంభం దక్కినట్టైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. రుతురాజ్‌ గైక్వాడ్ (92) దంచికొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇక గుజరాత్​ టైటాన్స్​ తరఫున శుభ్​మన్​ గిల్ (63)​ అద్భుత ప్రదర్శన చేశాడు. గిల్​కు సపోర్ట్​గా మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. చెన్నై ఇచ్చిన టార్గెట్​ను.. గుజరాత్​ టైటాన్స్​.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో డిఫెండింగ్​ ఛాంపియన్​నే విజేతగా నిలిచింది. వృద్ధిమాన్‌ సాహా (25; 16 బంతుల్లో), ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్‌ (22; 17 బంతుల్లో), విజయ్‌ శంకర్‌ (27; 21 బంతుల్లో), రషీద్‌ ఖాన్‌ (10 ), రాహుల్ తెవాతియా (15 ) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ (3), రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్ తీశారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్ (92 పరుగులు; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాది త్రుటిలో శతకం మిస్‌ చేసుకున్నాడు. మొయిన్‌ అలీ (23; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్‌ దూబె (19), ధోనీ (14), అంబటి రాయుడు (12), బెన్‌ స్టోక్స్‌ (7) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, షమి తలో రెండు వికెట్లు తీయగా.. లిటిల్ ఒక్క వికెట్ తీశాడు.

వీకెండ్​ స్పెషల్​.. డబుల్​ ధమాకా..
అట్టహాసంగా ఆరంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి డబుల్‌ ధమాకాకు రంగం సిద్ధమైంది. శనివారం పంజాబ్‌ కింగ్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్​లు జరగనున్నాయి. మొహాలిలో కొత్త కెప్టెన్ల నాయకత్వంలో పంజాబ్‌, కోల్‌కతా ఆడబోతున్నాయి.

ధావన్‌ సారథ్యంలోని పంజాబ్‌.. వేలంలో అత్యధిక ధర పలికిన సామ్‌ కరన్‌తో పాటు అర్ష్‌దీప్‌, రాహుల్‌ చాహర్‌, భానుక రాజపక్స, షారుక్‌ ఖాన్‌, మాథ్యూ షార్ట్‌, సికందర్‌ రాజా లాంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. గాయంతో బెయిర్‌స్టో మొత్తం సీజన్‌కు, లివింగ్‌స్టోన్‌ తొలి మ్యాచ్‌కు దూరమవడం ఆ జట్టుకు దెబ్బే అని చెప్పాలి. దీంతోపాటు రబాడ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. మరోవైపు, కొత్త కోల్​కతా కొత్త కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌, కొత్త కెప్టెన్‌ నితీష్‌ రాణా ఆధ్వర్యంలో ఆ టీమ్ ఉత్సాహంతో ఉంది. ఆల్‌రౌండర్లు రసెల్‌, నరైన్‌, వీస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌పై ఆ జట్టు ఆధారపడింది.

ఇదీ చూడండి : IPL 2023: రుతురాజ్ సెంచరీ జస్ట్​ మిస్​.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

Last Updated :Apr 1, 2023, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.